IOCL Recruitment 2020 493 Apprentice posts Recruitment  in IOCL . Indian Oil Corporation Limited invited applications from eligible for 493 Apprentice Posts in iocl.com Details are given below.

IOCL Recruitment 2020: Apply for 493 Apprentice posts on iocl.com

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), మార్కెటింగ్ డివిజన్ సదరన్  రీజియన్ అప్రెంటిస్ట్ భర్తీకి ప్రకటన విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడుల్లోమొత్తం 493 ఖాళీలు ఉన్నాయి.
అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 239, ఈడబ్ల్యూఎస్ 44, ఎస్సీ 72, ఎస్టీ 14, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు 124 అప్రెంటిన్లను కేటాయించారు.  తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైనవారికి అప్రెంటిషిప్ నిబంధనల మేరకు స్టయిపెండ్ చెల్లిస్తారు.



ఐఓసీఎల్ లో 493 అప్రెంటిసులు . 
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు "

ఆంధ్ర ప్రదేశ్: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ వంటి టెక్నికల్ ట్రేడుల్లో 33 ఖాళీలు, నాన్ టెక్నికల్ ట్రేడర్లు అయిన అకౌంటెంట్ 30, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రె షర్, స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవారు) 3 మొత్తంగా 66 ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ వంటి టెక్నికల్ ట్రేడుల్లో 31 ఖాళీలు, నాన్ టెక్నికల్ ట్రేడ్లు అయిన అకౌంటెంట్ 27, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్,( స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవారు) 3 మొత్తంగా 61 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ అప్రెంటిస్ ఖాళీ లకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతితోసంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
ఈ అకౌంటెంట్ అప్రెంటిసకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ / ఎస్టీ | దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. 
డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్) అప్రెంటిస్కు ఇంటర్ ఉత్తీర్ణత.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవారు)
అప్రెంటిస్కు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కు సంబంధించిన స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ డేటా ఎంట్రీ అభ్వరులకు 15 నెలలు, మిగిలినవారికి 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది.
ఏదైనా సంస్థలో ప్రస్తుతం అప్రెంటిస్ చేస్తున్న వారు, గతంలో అప్రెంటిస్ చేసిన అభ్యర్థులు దర ఖాస్తుకు అనర్హులు.

వయసు :2020 అక్టోబరు 31 నాటికి అభ్యర్థి వయసు 18 - 24 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక:
ఆ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రశ్నలను మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
ఈ ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ అభ్యర్థులకు జనరిక్ ఆప్టిట్యూడ్ కు తోడు క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్, రీజినింగ్ ఎబిలిటి, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ తో పాటు సంబంధిత టెక్నికల్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఆన్ లైన్ ట్రేడ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కోసం 
Trade Apprentice - ITI:http://apprenticeshipindia.org/candidate-registration
Trade Apprentice Accountant: http://apprenticeshipindia.org/
candidate-registration Trade Apprentice-Data Entry Operator: http://apprenticeshipindia.org/candidate-registration

సమాచారం :-
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
చివరి తేదీ: డిసెంబరు 12 
రాత పరీక్ష తేదీ: 2021 జనవరి 3
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ
వెబ్ సైట్: www.iocl.com,
https://www.iocl.com/PeopleCareers/job.aspx

Previous Post Next Post