Captain Abhilasha : తొలి మహిళా యుద్ధ పైలట్‌ ?

​​​​​​​భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ పైలట్‌గా కెప్టెన్‌ అభిలాష బారక్‌ చరిత్ర సృష్టించారు. నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ కేంద్రంలో మే 24 (మంగళవారం) ఉన్నతాధికారులు ఆమెకు సంబంధిత ‘వింగ్స్‌’ ప్రదానం చేశారు.


36 మంది పైలట్లతోపాటు ఆమె శిక్షణ పూర్తిచేశారు. హరియాణాకు చెందిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కోర్‌లో చేరారు. ఆమె తండ్రి ఓం సింగ్‌ సైన్యంలో కల్నల్‌గా చేశారు. ఏవియేషన్‌ కార్ప్స్‌లో చేరకముందే పలు ప్రొఫెషనల్‌ ఆర్మీ కోర్సులను ఆమె పూర్తి చేశారు


Ranil Wickramasinghe : శ్రీలంక ఆర్థిక మంత్రిగా ఎన్నికైన వ్యక్తి ?​​​​​​​



శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఒడ్డున పడేసే బాధ్యతను రణిల్‌ స్వీకరించారు.

Mohinder K. Midha : లండన్‌ తొలి దళిత మేయర్?

​​​​​​​భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు.

లండన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు. ఆమె ఎన్నిక పట్లయ లేబర్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమని యూకే లోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌’ చైర్మన్‌ సంతోష్‌దాస్‌ చెప్పారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఎప్పుడు : మే 21
ఎవరు : విశ్వనాథన్‌ ఆనంద్‌
ఎక్కడ : వార్సా, పోలాండ్‌
ఎందుకు : ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆనంద్‌ 14 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచినందున..​​​​​​​

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీ పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మే 21
ఎక్కడ : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ఫైనల్లో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 పాయింట్ల తేడాతో ఫ్రాన్స్‌ జట్టును ఓడించినందున..

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022 మహిళల రికర్వ్‌ విభాగంలో కాంస్యం గెలుపు
ఎప్పుడు : మే 19
ఎవరు : కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్‌తో కూడిన భారత జట్టు
ఎక్కడ : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6–2 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించినందున..

క్విక్‌ రివ్యూ:

ఏమిటి : 2021–22లో అత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశం?
ఎప్పుడు : మే 20
ఎవరు : సింగపూర్‌
ఎక్కడ : భారత్‌
ఎందుకు: వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు..

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : మే 18
ఎవరు : భారత నావికా దళం, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్‌ సమీపంలో సముద్రతీర ప్రాంతం, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు..​​​​​​​
Previous Post Next Post