AP Govt Plans to conduct Training to Teachers on CBSE   

సిబిఎస్ ఈ పై ఉపాధ్యాయులకు శిక్షణ
నిష్పత్తికి తగ్గట్టు సిబ్బంది ఉండాలి
విద్యాశాఖ సమీక్షలో సిఎం జగన్


AP Govt Plans to conduct Training to Teachers on CBSE   

సిబిఎస్ ఈ పై ఉపాధ్యాయులకు శిక్షణ
నిష్పత్తికి తగ్గట్టు సిబ్బంది ఉండాలి
విద్యాశాఖ సమీక్షలో సిఎం జగన్

సిబిఎస్ఇ సిలబస్ పై ఉపాధ్యాయులకు అవగాహన, శిక్షణ కల్పించాలని విద్యాశాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంచి విద్య అందరికీ అందాలని, పేదపిల్లలు గొప్పగా చదువుకోవాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ ఇ గుర్తింపు ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.

2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సిబిఎస్ బోర్డు నుంచే పరీక్షలు రాస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని సిబిఎస్ఇ తెరవనుండని పేర్కొన్నారు. తనిఖీలు, పర్యవేక్షణ పటిష్టంగాఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇంగ్లీష్ లో బోధించడం, మాట్లాడటం అలవాటు చేయాలని చెప్పారు. ప్రీ ఫ్రైమరీ అంగన్ వాడీల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రైమరీ పెడుతున్నామని తెలిపారు. 

నాడు-నేడు మొదటి దస క్రింద పూర్తయిన పనులను స్వయంసహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలని ఆదేశించారు అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్ 30నప్రజలకు అంకితం చేస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభించేనాటికి విద్యాకానుక కిట్లు విద్యార్థులకు అందాలని ఆదేశించారు. గోరుముదం పై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలన్నారు విద్యాకానుకలో అందించనున్న డెయిరీ, పాఠ్యపుస్తకాలు, బ్యాగులను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు మగురుదొడ్ల నిర్వహణ పై ఎస్ఒపితో కూడిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, సమగ్ర కక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టరు వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post