Demand of Old Coins - మీ దగ్గర ఈ పాత నాణేలు ఉన్నాయా - అయితే మీరు 25 లక్షలు పొందవచ్చు. పాత నాణేలకు డిమాండ్.. ఒక్కోటీ రూ.25 లక్షలు... ఇక్కడ అమ్మేయండి
Old Coins sale: మీ దగ్గర పాత రూపాయిలు, పాత నాణేలు ఉన్నాయా.. అయితే మీరు లక్షలు సంపాదించవచ్చు. ఈ స్టోరీ చదివితే... మొత్తం అర్థమైపోతుంది. మీరే స్వయంగా అమ్ముకోవచ్చు..


 Demand of Old Coins - మీ దగ్గర ఈ పాత నాణేలు ఉన్నాయా - అయితే మీరు 25 లక్షలు పొందవచ్చు

నాణేల సేకరణ (numismatics) అనే హాబీ ఒకటి ఉంటుందని మీకు తెలుసు కదా. ఈ హాబీ ఉన్న వాళ్లు... పాత నాణేలు సేకరిస్తూ ఉంటారు. వాటి ధర ఎంత అన్నది వీరికి మ్యాటర్ కాదు. అరుదైనవి సేకరించామా లేదా అన్నదే వీళ్లకు ఉండే ప్రధానమైన ఆలోచన. అఫ్‌కోర్స్ మరీ కోట్లలో ధర ఉంటే వీళ్లు కొనకపోవచ్చు. కానీ లక్షల్లో ఉంటే కొనడానికి సిద్ధపడతారు. ఇలాంటి నాణేలు కొనడానికి ఇష్టపడేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లకు వీటిని ఎంతో ఈజీగా అమ్మవచ్చు. పురాతన నాణేలతో తమకు కలిసి వస్తుందని నమ్మేవాళ్లూ ఉన్నారు. వాళ్లు కూడా పాత నాణేలను ఆసక్తిగా కొంటారు. ఇందుకోసం ఇంటర్నెట్‌లో కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లు (e-commerce websites) అవకాశం ఇస్తున్నాయి. మీ దగ్గర రూ.1, రూ.5, రూ.10 నాణేలు ఉంటే... అవి ప్రత్యేక బొమ్మలతోనో, ప్రత్యేక గుర్తులతోనో ఉంటే... వాటిని అమ్మి మీరు లక్షాధికారి కావచ్చు. ఎలాగో క్లారిటీగా తెలుసుకుందాం.


వైష్ణోదేవి బొమ్మ ఉందా?
మీ దగ్గర ఉన్న రూ.5 లేదా రూ.10 కాయిన్లపై వైష్ణోదేవి (Vaishnodevi) బొమ్మ ఉంటే... అలాంటి కాయిన్లకు ఈ-కామర్స్ సైట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఒక్కటి ఉన్నా చాలు... మీరు క్షణాల్లో లక్షాధికారి అవుతారు. వైష్ణోదేవి ప్రధాన ఆలయం జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో ఉంది. ఈ అమ్మవారి ఫొటోలతో ఉన్న కాయిన్లను కేంద్ర ప్రభుత్వం 2002లో ముద్రింపజేసింది. ఈ కాయిన్ తమ దగ్గర ఉంటే... అష్టైశ్వర్యాలూ తమతో ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు. దీన్ని కొనేందుకు రెడీగా ఉన్నారు. అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అమ్మేవారే కనిపించట్లేదు. మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే... మీరు ఆన్‌లైన్‌లో వేలం (auction) వేసి అత్యధిక ధరకు అమ్ముకోవచ్చు.

అలాంటి రూపాయి ఉందా?
1913లో విడుదలైన రూపాయి నాణేలకు కూడా డిమాండ్ చాలా ఉంది. మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే... మీరు ఈజీగా రూ.25 లక్షలు సంపాదించగలరు. అప్పట్లో నాణేలను వెండి (silver)తో తయారుచేసేవాళ్లు. అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు. ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది. కానీ అలాంటి రూపాయలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కింది ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మీరు అరుదైన కాయిన్లను అమ్ముకోవచ్చు.
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/
 

ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో చాలా మంది పాత నాణేల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో అమ్ముకోవడానికి ముందుగా మీరు సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడీ ద్వారా లాగిన్ అయ్యి... మీ దగ్గరున్న కాయిన్ ఫొటోలను అప్‌లోడ్ చెయ్యాలి. మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తద్వారా ఎవరికైనా నాణేలు కావాలంటే మీకు కాల్ చేసి కొనుక్కుంటారు. అంతే సో ఈజీ

Previous Post Next Post