The Top 5 Points to be remembered while taking Home Loan / Housing Loan. Now all the Nationalized Banks and Housing Banks are offering Home Loans at very low interest rate. Owning a house is one of the biggest financial decisions that you and your family will ever make. For most first-time home buyers, availing a home loan is the only way they can bring alive their aspirations of home ownership.

Top 5 Things Must Know before taking Home Loan / Housing Loan


హోమ్ లోన్ కోసం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన 5 విషయాలు. ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి:

1. వడ్డీ చెల్లింపులు
హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం:

● ఫ్లోటింగ్
● ఫిక్స్డ్


ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి
హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది.

ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

3. డౌన్ పేమెంట్
రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది.

4. అనుబంధఛార్జీలు
హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది.
ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.

5. క్రెడిట్ స్కోర్
హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం.

పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు
Previous Post Next Post