Canara Bank 240 Specialist Officers Recruitment Notification 2020 Eligible candidatesare requested to apply ON-LINE through link given in our Bank’s website www.canarabank.com. RECRUITMENT OF SPECIALIST OFFICERS IN VARIOUS DISCIPLINES INSCALE I & SCALE II

Canara Bank 240 Specialist Officers Recruitment Notification 2020

240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కెనరా బ్యాంకులో ఖాళీగా ఉన్న 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆన్ లైన్లో ఈ నెల 25 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 20-35 మధ్య వయస్కులు ఈ పోస్టుల దరఖాస్తుకు అర్హులు.

ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లా మేనేజర్లకు లా డిగ్రీ అవసరం. కాస్ట్ & చార్టర్డ్ అకౌంటెంట్లకు సీఏ కోర్సు, ఫైనాన్స్ మేనేజర్లకు ఎంబీఏ/ఎంఎంఎస్ (ఫైనాన్స్) పూర్తి చేసి ఉండాలి. డేటా మైనింగ్ ఎక్స్పర్టులకు ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్/ ఆపరేషన్ రీసెర్చ్ / ఎకనామిక్స్/ మేడ్స్) ఉత్తీర్ణత అవసరం. అను భవం ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు.

బ్యాగ్ మేనేజర్లకు డిగ్రీ/ పీజీ ఉండాలి. డిప్లొమా (రిస్క్ మేనేజ్మెంట్/ ట్రెజరీ మేనేజ్ మెంట్/ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్) చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంకింగ్ విభాగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం అవసరం. బ్యాక్ లాగ్ సీనియర్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 2020 అక్టోబరు 1 నాటికి 25 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. 

బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్, ఎక్స్ ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మర్ అండ్ లోడ్( ఈటీఎల్) స్పెషలిస్ట్, బీఐ స్పెషలిస్ట్, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్/ప్రోగ్రా మర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎఓసి ఆనలిస్ట్ పోస్టులకు 20 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 22 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 25 నుంచి
చివరితేదీ: డిసెంబరు 15
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు లకు రూ.100(ఎవరికైనా జీఎనీ అదనం)

పరీక్ష తేదీ: 2021 జనవరి/ఫిబ్రవరిలో(తాత్కాలికం)
వెబ్ సైట్: www.canarabank.com

Previous Post Next Post