SPRUHA Free Intermediate Scholarship Test 2024 for SC,ST Students. SPRUHA అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ 2024 సం.లో పదవ తరగతి పరీక్షలలో 525 అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన - SC/ST/ BC సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు లేని పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని తిరుమల/నారాయణ/ చైతన్య వంటి కళాశాలలో ఇంటర్మీడియట్ ఉచితంగా చదివిస్తారు. 

కళాశాల ఫీజులు, హాస్టల్ ఫీజులు అన్నీ SPRUHA TRUST వారు భరిస్తారు. మీ పాఠశాలలో ఎవరైనా ఇటువంటి విద్యార్థులు ఉంటే వారిచేత అప్లై చేయించండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లో ఉన్నవి. 


I. ట్రస్ట్ ఆశయాలు మరియు గమ్యాలు

1) ట్రస్ట్ యొక్క ఆశయాలు అంబేద్కర్ అందించిన ఫలాలు అనేకులకు కాకపోయినా కనీసం ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత మరియు సరైన మార్గదర్శకం లేక, ఉన్న అవకాశములను అందిపుచ్చుకోలేకపోతున్న అట్టడుగు వర్గాల అనాధలు, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు, మరియు నిరుపేదలను గుర్తించి వారికి ఉన్నత విద్యలు చదివించి మరియు కెరీర్ గైడెన్స్ ఇప్పించి ఉత్తమ మరియు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుటకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.

2) ఈ ట్రస్టు ద్వారా రాబోయే 10 సంవత్సరాలలో 100 మంది IITan లను మరియు 50 మంది డాక్టర్లను తయారు చేయుట ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము.

3) ఈ ఆశయ సాధన కోసం భావ సారూప్యం కలిగిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల, వ్యాపారస్తుల, మరియు సంస్థల యొక్క సహకారంతో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మేము సైతం మా వంతు ప్రయత్నం చేయుటకు ఈ ట్రస్టు కృషి చేస్తుంది.

II. ఈ ట్రస్టు ద్వారా చేపట్టబోయే కార్యక్రమములు.

A) 2024 - 25 సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సు నందు 100% స్కాలర్షిప్ తో చదివించుటకు 2023 - 24 విద్యా సంవత్సరంలో SSC ఉత్తీర్ణులైన అభ్యర్థుల తో ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయబడుతుంది.

B) ఆసక్తి కలిగిన విద్యార్థులను ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపులలో చదివించడం జరుగుతుంది.

C) వ్రాత పరీక్షలో సెలెక్ట్ అయిన విద్యార్థులను రాజమండ్రి, కాకినాడ విజయవాడలోని ప్రైవేట్ కార్పొరేటు కళాశాలలో చదివించడం జరుగుతుంది.

D) సెలెక్ట్ అయిన విద్యార్థులు పూర్తిగా రెసిడెన్షియల్ వసతితో విద్య అందించబడుతుంది

E) ఇంటర్ విద్యతో పాటు ఐఐటి జేఈఈ నీట్ లకు కోచింగ్ ఇప్పించబడును

F) ఇంటర్ తర్వాత IIT, NIT, JNTU మరియు AIMS, మరియు JIPMER వంటి జాతీయస్థాయి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో చదివేటప్పుడు స్కాలర్షిప్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

G) స్పృహ ప్రోగ్రాం కింద ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఐఐటీలు మరియు ఐయిమ్స్ లలో చదువుతున్న సీనియర్ విద్యార్థులచే కెరీర్ గైడెన్స్ ఇప్పించబడును

H) స్పృహ ప్రోగ్రాం కింద ఉన్నత చదువులు చదివిన ప్రతి విద్యార్థికి ఉన్నత ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడే వరకు స్పృహ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుంది.

III) ఈ సంవత్సరంలో ఈ స్కీము దరఖాస్తు చేసుకొనుటకు అర్హతలు.

A) ఎస్సీ జాబితాలో చేర్చబడిన 59 ఉపకులాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఎస్టీ జాబితాలో చేర్చబడిన 32 ఉప కులాల విద్యార్థిని విద్యార్థులు.

B) 2023 2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు పాస్ అయి 525 మార్కులు పైబడి సాధించినవారు.

C) షెడ్యూల్డ్ కులాలకు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అనాధలు, సింగల్ పేరెంట్స్ పిల్లలు, నిరుపేదలు.

D) తల్లిదండ్రుల వార్షికాదాయము గ్రామీణ ప్రాంతాలలో 1,20,000 పట్టణ ప్రాంతాలలో 1,44, 000 రూపాయలు మించని వారు.

IV) అర్హులు కాని వారు.

A) ప్రైవేటు మరియు కార్పోరేట్ పాఠశాలల్లో చదివిన పిల్లలు

B) 2024 కు ముందే ఎస్ ఎస్ సి పరీక్షలు పాస్ అయిన వారు

C) ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాస్ అయిన వారు.

D) జూలై 1వ తేదీ 2024 నాటికి 16 సంవత్సరాలు నిండిన వారు ఈ స్కీమునకు అర్హులు కాదు.

V) దరఖాస్తు విధానము.

A) ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పృహ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడిన గూగుల్ లింక్ నందు మరియు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవలెను.

B) దరఖాస్తులు చేసేటప్పుడు విధిగా ఆధార్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్ ,మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రము విధిగా అప్లోడ్ చేయవలెను లేనియెడల దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

C). ఆధార్ కార్డు లోని అడ్రస్ ఆధారంగా మాత్రమే జిల్లా స్థానికత పరిగణించబడుతుంది.

D) విద్యార్థుల దరఖాస్తులు అభ్యర్థి యొక్క ఫోటో మరియు సంతకము విధిగా అప్లోడ్ చేయవలెను.

E) తదుపరి ఉత్తర ప్రత్యుత్తరమునకు అప్లోడ్ చేసిన దరఖాస్తును హార్డ్ కాపీ కలిగి ఉండవలెను.

F) దరఖాస్తు పైన విద్యార్థి ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబరు తండ్రి, తల్లి ఫోన్ నెంబరు విధిగా పొందుపరచవలెను.

G) అసంపూర్తి దరఖాస్తులు పరిశీలించబడవు.

H). ఆన్లైన్ దరఖాస్తులు తేదీ 27-04-2024 నుండి 5 -05 -2024 అర్ధరాత్రి 11 :59 నిమిషాల వరకు స్వీకరించబడును.

I) Offline దరఖాస్తులు స్వీకరించబడవు .

J). సర్టిఫికెట్లు అప్లోడ్ చేయని యెడల దరఖాస్తులు తిరస్కరించబడతాయి

VI) సెలక్షన్ విధానము.

A) దరఖాస్తు చేసిన అందరూ అభ్యర్థులకు రాజమండ్రిలో రాత పరీక్ష నిర్వహించబడుతుంది.

B) రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీలో 100% స్కాలర్షిప్ తో ఇంటర్మీడియట్ చదివించడం జరుగుతుంది.

C) రాత పరీక్ష లో ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు వచ్చినయెడల ఎస్ఎస్సి లో గణితములో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

D) గణితంలో కూడా సమానమైన మార్కులు వచ్చినట్లయితే సైన్స్ లో వచ్చిన మార్కులు ఆధారంగా క్యాండిడేట్ ని సెలక్షన్ చేయడం జరుగుతుంది.

E) సైన్స్ లో కూడా సమానమైన మార్కులు వచ్చినట్లయితే ఇంగ్లీషులోని మార్పులు ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది.

F) ఒకవేళ పై మూడు సబ్జెక్టులలో సమానమైన మార్కులు వచ్చిన ఎడల పుట్టిన తేదీ ఆధారంగా వయసులో పెద్దవారికి సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.

G) సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుంది.

H) సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ ద్వారా కోరుకున్న కాలేజీలో ప్రవేశం కల్పించడం జరుగుతుంది.

గమనిక :: 

దరఖాస్తు తో పాటుగా విధిగా అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు

1) ఎస్ ఎస్ సి మార్కుల మెమో

2) కుల ధ్రువీకరణ పత్రము

3) ఆదాయ ధ్రువీకరణ పత్రము 

4)విద్యార్థి ఆధార్ కార్డు
  • అసంపూర్తి దరఖాస్తులు మరియు గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. 
  • రికమండేషన్లు అనుమతించబడవు.
  • సర్టిఫికెట్లు అప్లోడ్ చేయని యెడల దరఖాస్తులు తిరస్కరించబడతాయి

సిలబస్ : 

  • ఇంజనీరింగ్ : మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (10వ తరగతి అడ్వాన్స్ స్థాయి) 
  • మెడికల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్సు (10వ తరగతి అడ్వాన్స్ స్థాయి)

Contact us: 

9390059900, 7981696481, 
9959507507, 9494571345

Address :

D. No: 62-10-16,
Siddhartha nagar,
Ramdas Peta,
Rajahmundry,
Andhra Pradesh. 
Pin code - 533103


Previous Post Next Post