ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు) నందు వివిధ ప్రభుత్వ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన ఈ క్రింద తెలియ చేయబడిన బాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్థి వయస్సు ధరఖాస్తు చేసే నాటికి 18 సంవత్సరములు పైబడి తేది.01-07-2023 నాటికి 52 42 10 సంవత్సరములు దాటి ఉండరాదు. ధరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 13-04-2023.

విశాఖపట్నం జిల్లా విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బాక్ లాగ్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన

ఆర్.సి.నెం.ఎ1/249/2022 తేది 30 -03-2023






Visakhapatnam District Backlog Recruitment 2023 Education Qualifications

Librarian Grade III

CLISC తో పాటు పి.యు.సి.,/ఇంటర్ ఉత్తీర్ణత. ALIS కోర్సులో సాధించిన మార్కులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Workshop Attender

10వ తరగతి మరియు ఏదైనా ఐ.టి.ఐ. ట్రేడ్ ఉత్తీర్ణత. 1సం. అనుభవం కలిగి ఉండవలెను. ఐ.టి.ఐ. లో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా ఎంపిక చేయబడతారు. ఈ పొస్టుకు అర్హత గల అంధులు (ఓపెస్) లేని ఎడల మాత్రమే బధిరులు (ఓపెన్) లను, అర్హత గల బధిరులు (ఓపెస్) లేని ఎడల మాత్రమే శారీరక దివ్యాంగులు (ఓపెస్) ను, అర్హత గల శారీరక దివ్యాంగులు (ఓపెన్) లేని ఎడల మాత్రమే మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ఓపెస్)ను పరిగణలోనికి తీసుకొనబడును. కావున ఈ పోస్టునకు అర్హత గల అంధులు (ఓపెస్), బధిరులు (ఓపెస్) శారీరక దివ్యాంగులు (ఓపెన్) మరియు మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ఓపెస్) కూడా ధరఖాస్తు చేసుకోవచ్చును

Lab Attender 

10వ తరగతి మరియు ఏదైనా ఐ.టి.ఐ. ట్రేడ్ ఉత్తీర్ణత. 1సం. అనుభవం కలిగి ఉండవలెను. ఐ.టి.ఐ. లో సాధించిన మార్కులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఈ పొస్టుకు అర్హత గల అంధులు (ఓపెస్) లేని ఎడల మాత్రమే బధిరులు (ఓపెస్) లను, అర్హత గల బధిరులు (ఓపెస్) లేని ఎడల మాత్రమే శారీరక దివ్యాంగులు (ఓపెస్)ను, అర్హత గల శారీరక దివ్యాంగులు (ఓపెస్) లేని ఎడల మాత్రమే మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ఓపెస్)ను పరిగణలోనికి తీసుకొనబడును. కావున ఈ పోస్టునకు అర్హత గల అంధులు (ఓపెస్), బధిరులు (ఓపెస్) శారీరక దివ్యాంగులు (ఓపెస్) మరియు మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ఓపెస్) కూడా ధరఖాస్తు చేసుకోవచ్చును.

Workshop Attender (Female)

10వ తరగతి మరియు ఏదైనా ఐ.టి.పి. (ట్రేడ్ ఉత్తీర్ణత. ఐ.టి.ఐ. లో సాధించిన మార్కులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు

Multi Purpose Health Assistant (Male)

10వ తరగతి తో పాటు MPHW (మేల్ - 11/12 మాసములు) ట్రైనింగ్ పాస్ సర్టిఫికెట్ ఉండవలెను. ఎ.పి. పారా మెడికల్ బోర్డ్ నందు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఉండవలెను. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అభ్యర్ధులు MPHW పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఈ పొస్టుకు అర్హత గల అంధులు (మేల్) లేని ఎడల మాత్రమే బధిరులు (మేల్) లను, అర్హత గల బధిరులు (మేల్) లేని ఎడల మాత్రమే శారీరక దివ్యాంగులు (మేల్) ను, అర్హత గల శారీరక దివ్యాంగులు (మేల్) లేని ఎడల మాత్రమే మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (మేల్)ను పరిగణలోనికి తీసుకొనబడును. కావున ఈ పోస్టునకు అర్హత గల అంధులు (మేల్), బధిరులు (మేల్) శారీరక దివ్యాంగులు (మేల్) మరియు మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (మేల్) కూడా ధరఖాస్తు చేసుకోవచ్చును.

Multi Purpose Health Assistant (Male)

10వ తరగతి తో పాటు MPHW (మేల్ 11/12 మాసములు) ట్రైనింగ్ పాస్ సర్టిఫికెట్ ఉండవలెను. ఎ.పి. పారా మెడికల్ బోర్డ్ నందు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఉండవలెను. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అభ్యర్ధులు MPHW పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Attender

8 వ తరగతి ఉత్తీర్ణత అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు) అభ్యర్థులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

 Sweeper cum Watchman

8 వ తరగతి ఉత్తీర్ణత అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు). వయస్సు (15 మార్కులు) అభ్యర్థులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Office Sub-Ordinate

7వ తరగతి ఉత్తీర్ణత అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Last Grade Servant (Night Watchman)

5వ తరగతి ఉత్తీర్ణత అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు

Female Attendant

తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండవలెను. అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కుల వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Sweeper

తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండవలెను. అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు),
వయస్సు 15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

P.H.Worker

తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండవలెను. అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు), ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ముఖ్య సూచనలు:

1) ఉద్యోగ ప్రకటన, సూచనలు మరియు ధరఖాస్తు నమూనా జిల్లా వెబ్ సైట్ https://visakhapatnam.ap.gov.in ద్వారా పొందవచ్చును. లేదా కార్యాలయ పని దినములలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణము, పెదవాల్తేరు, విశాఖపట్నము నందు పొందవచ్చును.

2) పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణము, పెదవాల్తేరు, విశాఖపట్నము - 530017 అను చిరునామాకు కార్యాలయపు పని దినములలో తేది. 13-4-2023 సాయంత్రం గం.5.00 లోపు స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలెను. గడువు తేది తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు.

3) పోస్టు ద్వారా అందడంలో జరిగిన జాప్యానికి జిల్లా పరిపాలనా యంత్రాంగము బాధ్యత వహించదు.

4) కవరు మీద “విభిన్న ప్రతిభావంతుల బాక్ లాగ్ ఉద్యోగము పేరు "..... ఓపెన్/మహిళ కొరకు" అని వ్రాయవలెను. 

5) ప్రతి పోస్టునకు వేరు వేరుగా ధరఖాస్తు చేయవలెను.

6) మహిళలకు కేటాయించబడిన పోస్టులకు మహిళలు మాత్రమే ధరఖాస్తు చేయవలెను. మరియు ధరఖాస్తులో మహిళ వద్ద (*)మార్కు చేయవలెను. అట్లు చేయనిచో ధరఖాస్తులు పరిగణనలోనికి తీసుకొనబడవు.

7) ధరఖాస్తుతో పాటు గజిటెడ్ అధికారి వారిచే ధ్రువీకరణ చేసిన 
  • పుట్టిన తేది ధ్రువపత్రము, 
  • సదరం వైద్య ధ్రువీకరణ పత్రము,  
  • విద్యార్హతల ధ్రువీకరణ పత్రములు, 
  • ఎంప్లాయిమెంట్ కార్డ్, 
  • 1 వతరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, 
  • నివాస ధ్రువీకరణ పత్రము, 
  • జనన ప్రదేశము ధ్రువీకరణ పత్రము, 
  • రేషన్ కార్డ్,
  • ఆధార్ కార్డ్ జత పరచవలెను. 
  • పాస్ పోర్ట్ సైజు ఫోటో ధరఖాస్తుకు అతికించవలెను. 
ధ్రువపత్రములు జత చేయబడని ధరఖాస్తులు తిరస్కరించబడును.

8) కనీస విద్యార్హత/సాంకేతిక విద్యార్హతలకు సంబంధించిన మార్కుల ధ్రువీకరణ పత్రములు తప్పని సరిగా జతపరచవలెను. అట్లు జత చేయబడని ధరఖాస్తులు తిరస్కరించబడును.

9) అభ్యర్థులు స్థానికతకు సంబంధించి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణించబడును. ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు మరియు బధిర అభ్యర్థులు స్థానికతకు సంబంధించి వారి యొక్క తల్లిదండ్రుల స్థిర నివాసమును (ధ్రువీకరణ పత్రం ద్వారా) అభ్యర్థుల యొక్క స్థానిక జిల్లా పరిగణించబడును.

10 శారీరక, ద్రుష్టిలోపం మరియు మేధో వైకల్యం / నిర్దిష్ట అభ్యాస వైకల్యం / మానసిక అనారోగ్యం / బహుళ వైకల్యం / స్పెక్ట్రం డిజార్డర్ గల వారైతే వైకల్య శాతం కనీసం 40 శాతం ఉండవలెను. బధిరుల విషయంలో కనీస వైకల్యం 75 శాతం కలిగి ఉండవలెను. వైకల్య శాతం స్పష్టంగా వున్న సదరం వైద్య ధ్రువపత్రం మాత్రమే అంగీకరించబడును.

11) ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఎంపిక కాబడిన అభ్యర్థులు వైకల్య ధ్రువీకరణ కొరకు అప్పి ట్ మెడికల్ బోర్డ్ కు పంపడానికి నియామక కమిటీకి అధికారము కలదు.

12) ఈ ప్రకటనలో చూపబడిన ఉద్యోగ ఖాళీల సంఖ్య సుమారుగా చూపబడింది. చూపబడిన ఖాళీల సంఖ్య పెరగవచ్చును లేదా తగ్గవచ్చును.

13) ఈ ప్రకటనలో చూపబడిన పోస్టులు / ఖాళీలు రద్దు చేయుటకు లేదా ఈ ప్రకటనను పూర్తిగా రద్దు చేయుటకు జిల్లా పరిపాలనా యంత్రాంగమునకు పూర్తి అధికారము కలదు.

14) ధరఖాస్తు చేసినంత మాత్రాన ఉద్యోగ నియామక విషయములో ఎటువంటి గ్యారెంటీ లేదు.

15) అభ్యర్ధుల ఎంపిక కొరకు వ్రాత పరీక్ష గాని మౌఖిక ఇంటర్వ్యు గాని ఉండవు.

16) అర్హత లేని మరియు అసంపూర్తి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవు.

17) అభ్యర్థులు వారి వైకల్య తరగతికి చెందిన ఉద్యోగములకు మాత్రమే అర్హులు.

18) దివ్యాంగులు కాని వ్యక్తులు ఈ ఉద్యోగములకు ధరఖాస్తు చేయరాదు.

19) ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగులైన అభ్యర్ధులు ఈ ప్రకటనను అసరించి ధరఖాస్తు చేయదలచినచో సంబంధిత అధికారి అనుమతి పత్రముతో మాత్రమే ధరఖాస్తు చేసుకోవలెను. లేనియెడల ధరఖాస్తు తిరస్కరించబడును. 

20) ఇతర వివరములు లేదా సందేహ నివృత్తి నిమిత్తము విభిన్న ప్రతిభాసంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయపు పని దినములలో ఫోన్ నెం.0891-2952585 న సంప్రదించవలెను.

Click Here to Download Notification PDF & Application Form

Join Our Groups For More Govt & Private Job News Updates

Telegram
Whatsapp


Previous Post Next Post