Guntur District Physically Challenged 49  Backlog Vacancies Recruitment 2022 AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

Guntur District Physically Challenged Employees Recruitment

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (AP Job Notification) విడుదలైంది. మొత్తం 49 బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకుంటుంది.

విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన, గుంటూరు జిల్లా -2022-23

వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి అవిభాజ్య (ఉమ్మడి) గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన 49 బ్యాక్ లాగ్ పోస్టులకై
దరఖాస్తులు తేది: 06.12.2022 సాయంత్రం 5గం. లోపు ఆహ్వానించడమైనది.
దరఖాస్తును తేది. 22.11.2022 నుండి తేది. 06.12.2022 సాయంత్రం 5 గం. లోపు దరఖాస్తు స్వీకరించబడును. దరఖాస్తు చేసే నాటికి అభ్య కనీస వయస్సు తేది. 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అలాగే గరిష్ట వయస్సు (42+10) 52 సంవత్సరములు దాటి ఉండరాదు.

Guntur District Physically Challenged 49 Backlog Vacancies

క్రమ సంఖ్య పోస్టు ఖాళీలు
1. జూనియర్ అసిస్టెంట్ 06
2. జూనియర్ ఆడిటర్ 01
3. టైపిస్ట్ 02
4. టైపిస్ట్/స్టెనో 01
5. ఎంపీహెచ్ఏ 01
6. హెల్త్ అసిస్టెంట్ 01
7. మెటర్నిటీ అసిస్టెంట్ 01
8. బోర్ వెల్ ఆపరేటర్ 01
9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 09
10. షరాఫ్ 01
11. ఆఫీస్ సబార్డినేట్ 07
12. వాచ్ మెన్ కమ్ హెల్పర్ 01
13. జూనియర్ స్టెనోగ్రాఫర్ 01
14. వెటర్నరీ అసిస్టెంట్ 01
15. ఫార్మసిస్ట్ గ్రేడ్-2 01
16. వాచ్ మెన్ 03
17. నైట్ వాచ్ మెన్ 02
18. బంగ్లా వాచర్ 01
19. కమాటి 02
20. స్కావెంజర్ 01
21. స్వీపర్ 01
22. పీహెచ్ వర్కర్ 01
23. యుటెన్సిల్ క్లీనర్ 01
24. బేరర్ 01

మొత్తం ఖాళీల సంఖ్య: 49

వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

దరఖాస్తు ఇలా..
Step 1:
 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://www.gunturap.in/dw2022/) ఓపెన్ చేయాలి.
Step 2:
 అనంతరం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత మీకు కావాల్సిన పోస్టును ఎంచుకోండి.
Step 4:
 తర్వాత  సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయండి.

Important Notes on Guntur District PH BACKLOG Recruitment 2022


  • దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరముల పై బడి తేదీ 01-07-2022నాటికి 52 (42 +10 ) సంవత్సరములు దాటి ఉండరాదు.
  • సదరం వైద్య దృవీకరణ పత్రం జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీ చేయబడి శారీరక (చలన), దృష్టిలోపం, ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం దివ్యాంగులు అయితే కనీస వైకల్యం 40% మరియు బదిరులైతే (మూగ, చెవుడు) (a) "deaf means persons having 70 DB hearing loss in speech frequencies in both ears, (b) “hard of hearing" means person having 60 DB to 70 DB hearing loss in speech frequencies in both ears కలిగి ఉండాలి.. 
  • ఎంపిక సమయంలో జిల్లా కమిటి నిర్ణయము మేరకు అవసరమైన ధృవీకరణ పత్రము ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం స్టేట్ అప్పిలేట్ మెడికల్ బోర్డు, విశాఖపట్నం వారికి వైకల్య శాతంను దృవీకరించుటకు పంపబడి, బోర్డు వారు నిర్ణయము మేరకు మాత్రమే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీచేయబడును.
  • దరఖాస్తుచేసుకొనుటకు నోటిఫికేషన్ ప్రచురించిన తేది నుండి 06.12.2022 సాయంత్రము 5 గం. ల లోపు https://www.gunturap.in/dw2022 వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో అప్లికేషను అప్లోడ్ చేయవలెను. దానితో పాటు సంబంధిత నిర్ణీత దృవపత్రములు అనగా (1) సదరం వైద్య దృవీకరణ పత్రము, (2) విద్యార్హత దృవీకరణ పత్రములు, (3) ఎంప్లాయిమెంట్ కార్డు, (4) 4 నుండి 10వ తరగతి వరకు స్టడీ ద్రువపత్రాలు (5) స్థిర నివాస దృవీకరణ పత్రము మరియు (6) పాస్ ఫోర్టు సైజు ఫోటో మొదలగు వాటిని తేది. 06.12.2022 సాయంత్రము 5 గం. లోపు అప్లోడ్ చేయవలెను
  • ప్రభుత్వ ఉత్తర్వులు Go.Ms.No. 52 LET Department, తేది. 19.04.2012 ప్రకారం ఉద్యోగ ప్రకటన తేదీనాటికి అభ్యర్ధులు తమ పేరును జిల్లా ఉపాది కార్యాలయము నందు నమోదు చేసుకొని ఉండవలెను. నమోదు చేసుకొని వారు దరఖాస్తు చేసిన వారికి ఎంప్లాయిమెంట్ సీనియారిటి మార్కులు కేటాయించబడును.
  • ఓకే అభ్యర్ధి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన ప్రతి పోస్టునకు విడి విడిగా దరఖాస్తు చేసుకొనవలెను.
  • నిర్ణీత గడువు తదుపరి దరఖాస్తులు ఎటువంటి పరిస్థితులలోను అంగీకరించబడవు.
  • నోటిఫికేషన్ నందు ఆయా పోస్టులకు తెలియజేసిన విద్యార్హతలు అన్ని నోటిఫికేషన్ ఇచ్చే తేది నాటికి ఉత్తీర్ణులై ఉండవలెను. మరియు గ్రూప్ – 4 (DSC) నందు చూపబడిన పోస్టునకు సంబందించిన డిగ్రీ నందు పొందిన మార్కుల జాబితాను జతపర్చవలెను. గ్రూప్ – 4 (DSC) 1 నుండి 5 వరకు చూపిన పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇందులో మెరిట్ లిస్టులోని పై స్థానాలలో ఉన్న అభ్యర్ధులకు NIC ద్వారా కంప్యూటర్ టెస్ట్ నిర్వహించబడును. వారు కంప్యూటర్ టెస్ట్ నందు పాస్ కాని యెడల మెరిట్ లిస్టు లోని తరువాత అభ్యర్థికి అవకాశం ఇవ్వబడును.
  • అర్హత లేని మరియు అసంపూర్తి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయబడవు.
  • ఏ కారణం చేతనైన ప్రకటించిన అభ్యర్ధి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టు లోని తరువాత అభ్యర్ధిని పరిగణలోనికి తీసుకోనబడుతుంది. Go.Ms.No. 104 ప్రకారం దరఖాస్తు దారులైన అంధులు (దృష్టి లోపం) మరియు బధిరులు ప్రత్యేక పాఠశాలలో చదువుకున్న అభ్యర్ధులు (వినికిడి లోపం) వారి తల్లిదండ్రుల స్థానికత దృవీకరణ పత్రము (ఆయా మండల తహసిల్దార్ చే జరీచేయబడిన ద్రువపత్రము) ఖచ్చితంగా జతచేసుకోనవలెను.
  • సందర్భాన్ని బట్టి ఈ ప్రకటనలోని ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు లేదా పెరగవచ్చు మరియు ప్రకటనను రద్దుపరచే అధికారం కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారికి కలదు.
  • Go.Ms.No. 2, ప్రకారం శారీరక విభిన్న ప్రతిభావంతులకు కేటాయించబడిన రోస్టర్ పాయింట్ 56 లో సెరిబ్రల్ పాలసీ, లేప్రేస్సి క్యుర్డు, మరగుజ్జు, యాసిడ్ బాధితులు, ముస్క్యులర్ డిస్టోపి వారు కుడా దరఖాస్తు చేసుకోవచ్చును. వీరి అందరికి సదరం వైద్య దృవీకరణ | పత్రము జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీచేయబడియుండవలెను. కనీస వైకల్యం 40% కలిగిన వారిని శారీరక విభిన్న ప్రతిభావంతుల క్రింద పరిగణలోనికి తీసుకోనబడును.
  • ఈ బ్యాక్ లాగ్ ఉద్యోగాల కొరకు ప్రకటన సూచనలు, దరఖాస్తు నమూనా మరియు అన్ లైన్లో దరఖాస్తు చేసుకొను ప్రక్రియ https://www.gunturap.in/dw2022 వెబ్ సైట్లో చూడగలరు.

Online APPLY Website and Notification PDF Click Here

Previous Post Next Post