• గత ఏడాది కంటే 75 శాతం అధికంగా పీపీఓలు 
  • కోర్, ఐటీ నుంచి ఫైనాన్స్ వరకు పలు సంస్థల నుంచి ఆఫర్లు 
  • వేతనాలు కూడా భారీగానే


ఐఐటీల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ 

  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు.. 
  • సాంకేతిక విద్యలో అత్యున్నత శ్రేణి విద్యాసంస్థలుగా గుర్తింపు! 
  • వీటిలో చదువుకున్న వారికి సంస్థలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాయనే భావన! 
  • లక్షల ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తాయనే అభిప్రాయం!
  • వాస్తవానికి ఐఐటీలంటేనే కంపెనీలు తమకు అవసరమైన టాలెంట్ ను ఒడిసి పట్టుకునే కేంద్రాలు. 
  • ఈ విషయం నిజమని మరోసారి రుజువైంది. గత ఏడాది వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రీడ్ వర్కింగ్ విధానాల వల్ల పీపీఓల్లో కొంత తగ్గుదల ఏర్పడినా.. ఈసారి మళ్లీ అవి పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో... ఐఐటీల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ (పీపీవో) తాజా ట్రెండ్స్...ఆఫర్లు అందించిన రంగాలు, సంస్థలు,జాబ్ ప్రొఫైల్స్, కంపెనీలు కోరుకుంటున్న స్కిల్స్ పై ప్రత్యేక కథనం...

ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ......

  • క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీలు ఆయా ఇన్స్టిట్యూటకు వచ్చి, ఎంపిక ప్రక్రియ నిర్వహించి ఆఫర్లు ఇవ్వడం. 
  • ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అంటే ఫైనల్ ప్లేస్మెంట్స్ కంటే ముందే విద్యా ర్డులకు ఆఫర్లు ప్రకటించే ప్రక్రియ.. 
  • ఐఐటీల్లోని విద్యార్థులు సమ్మర్ ప్లేస్మెంట్స్ పేరుతో ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్లో చేరతారు. ఆ సమయంలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కంటే ముందుగానే సదరు విద్యార్థులకు సంస్థలు ఆఫర్స్ ఇచ్చే ప్రక్రియనే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు అంటారు. అంటే.. ఒక విద్యార్థి ఏదైనా సంస్థలో ఇం టర్న్షిప్ చేసిన సమయంలో అద్భుతమైన ప్రతిభ చూపితే సదరు విద్యా ర్థికి ఫైనల్ ప్లేస్మెంట్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సిన అవ సరం లేకుండానే ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్స్ పేరుతో ఉద్యోగాలు ఖరారవుతాయి.

సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు...... 

  • ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్స్ ప్రక్రియను కార్పొరేట్ కంపెనీలు ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి డిసెం బర్ వరకు దశల వారీగా చేపడతాయి. 2023లో ఆయా కోర్సులు పూర్తి చేసుకోనున్న వారికి తాజాగా తొలి దశలో భాగంగా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌ను ప్రకటించాయి. 
  • ఐఐటీ-ఢిల్లీలో తొలి దశలోనే 150 మందికి ప్రీప్లేస్ మెంట్ ఆఫర్లు లభించాయి.  
  • ఐఐటీ-గువహటిలో కూడా 182 మందికి పీపీఓలు అందాయి.  
  • ఐఐటీ-చెన్నైలో 213 మంది పీపీఓలు సొంతం చేసుకున్నారు. 
  • ఐఐటీ- BHU లో 203 మందికి పీపీఓలు ఖరారయ్యాయి.
  • ఐఐటీ-గాంధీనగర్‌లో గతం కంటే 75 శాతం అధికంగా పీపీఓలు లభించాయి. 
  • ఐఐటీ-హైదరాబాద్లో 60 శాతం అధికంగా పీపీఓలు దక్కాయి.  
  • ఐఐటీ-మండిలో ఇప్పటివరకు 56 మందికి పీపీఓలు ఖరారయ్యాయి.  
  • ఈ గణాంకాలన్నీ పీపీఓ ఎంపికలో తొలి దశకు చెందినవి మాత్రమేనని డిసెంబర్ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో నూటికి తొంభై శాతం మందికి పీపీ ఓలు ఖరారవుతాయని ఆయా క్యాంపస్ ప్లేస్మెం ట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పీపీఓ.. భారీ వేతనాలు....

  • ఈ ఏడాది ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ లో సంస్థలు భారీ వేతనాలను సైతం ఖరారు చేశాయి. 
  • రూ.91 లక్షల నుంచి రూ.1.2కోట్ల వరకు వేతనాలతో ఆఫర్లు ఇచ్చాయి.
  • డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ సైతం విద్యార్థులను పలకరించాయి. 
  • ఫైనల్ ప్లేస్ మెంట్స్ సమయానికి వీటిపై పూర్తి సమాచారం వెలువడనుంది.

కోర్ టు సర్వీస్.....

ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించిన విభాగాలను పరిశీలిస్తే కోర్ సెక్టార్ మొదలు సర్వీస్ సెక్టార్ వరకు పలు రంగాలకు చెందిన సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫర్స్ ఇవ్వడంలో ఐటీ రంగం అగ్రస్థానం లో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ప్రధానంగా కోర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, అనలిటిక్స్, బ్యాంకింగ్ రంగాలు ఉన్నాయి.

ఎంఎన్‌సీల నుంచి స్టార్టప్స్ వరకు .....

ఎంఎన్‌సీలు మొదలు స్టార్టప్ కంపెనీల వరకు పీపీవో ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అడోబ్, క్వాల్కమ్, వాల్ మార్ట్, సేల్స్ఫ ర్స్, ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు, మ్యాథ్ వర్క్, వేదాంతు వంటి యూనికార్న్ స్టార్టప్స్ పీపీఓలు అందించాయి. 
కోర్ సెక్టార్‌లో డీఈషా,జాడీర్, ఫోర్డ్ మోట ర్స్, బీఎన్‌వై మెలాన్, శాంసంగ్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బెయిన్ అండ్ కో, కేపీఎంజీ వంటివి పీపీఓలు ఖరారు చేశాయి.


డేటా అనలిటిక్స్ కు ప్రాధాన్యం.....

కన్సల్టింగ్, ఈ-కామర్స్ సంస్థలు డేటా అనలిటికకుADD ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. సంస్థల విస్తరణ, అభివృద్ధికి డేటా అనలిటిక్స్, డేటా కంపైలేషన్ వంటివి కీలకంగా మారుతున్నాయి. దీంతో ఈ విభాగాల్లో ఎక్కువ నియామకాలు చేపట్టినట్లు చెబుతున్నారు.

ఆటోమేషన్, కోడింగ్....... 

ఐటీ, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన సంస్థలు ఆటోమేషన్, కోడింగ్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చాయి. కంపెనీలు ఆటోమేషన్ ఆధారిత కార్య కలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటీ, రోబోటిక్స్ వంటి నైపుణ్యాలున్న వారిని ఎంపిక చేసుకున్నాయి. ఆటోమేషన్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి బ్యాక్ ఎండ్ లో సంబంధిత ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ రూపొందించేందుకు అవసరమైన కోడింగ్ నైపుణ్యాలున్న వారికి సంస్థలు ఎక్కువ ఆఫర్లు ఇచ్చాయి.

ఈ నైపుణ్యాలు తప్పనిసరి..... 

డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, క్రిటికల్ థింకింగ్, అడాప్టివ్ నెస్, టీమ్ వర్కింగ్ కల్చర్, బిహేవియరల్ స్కిల్స్ వంటి నైపు ణ్యాలున్న వారికి కంపెనీలు ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్, నాలెడ్జ్ అడేషన్ విషయంలో ముందున్న వారికే ప్రాధాన్యమిచ్చాయి. దీంతో ఫైనల్ ప్లేస్మెంటకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంటర్న్ గా రాణించిన వారికే...... 

ఆయా సంస్థల్లో సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్ ద్వారా ఇంటర్న్ ట్రైనీగా ఎంపికై..విధుల్లో మంచి పనితీరు చూపిన వారికి పీపీఓ ఆఫర్లలో ప్రాధాన్యం లభించింది. ఇంటర్న్ ట్రైనీగా సంస్థలో తమకు కేటాయించిన విభాగంలో నిర్వర్తించిన విధులు, టీమ్, సీనియర్స్, క్లయింట్లతో వ్యవహరించిన తీరు వంటివి పరిగణనలోకి తీసుకుని కంపెనీలు పీపీఓలు ప్రకటించాయి.

ఫైనల్ ప్లేస్ మెంట్ లోనూ..... 

  • ఇంటర్న్ ట్రైనీగా రాణించి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పొందిన విద్యార్థులు కావాలనుకుంటే ఫైనల్ ప్లేస్
  • మెంట్ ప్రక్రియలోనూ పాల్గొనొచ్చు. 
  • తమకు నచ్చిన సంస్థల్లో ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. 
  • పీపీఓ ద్వారా ఇప్పటికే ఆఫర్ ఖరారు చేసుకున్నప్పటికీ ఫైనల్ ప్లేస్మెంట్స్ లో పాల్గొని ఇంతకంటే మెరు గైన ఆఫర్ లభిస్తే దానికి ఆమోదం తెలిపే వీలు కూడా ఉంది. 
  • అధిక శాతం మంది పీపీఓ లభించిన సంస్థలోనే ఫైనల్ ఆఫర్‌ను ఖరారు చేసుకుంటున్నారని ఐఐటీ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫైనల్ ప్లేస్మెంట్స్ ఆశాజనకంగానే..... 

ఐఐటీల్లో తాజా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను పరిగణ నలోకి తీసుకుంటే ఫైనల్ ప్లేస్మెంట్స్ మరింత ఆశాజనకంగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
సంస్థల కార్యకలాపాలు కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడం, వ్యాపార ప్రణాళికల్లో భాగంగా డిజిటల్, టెక్నాలజీ ఆధారిత సేవలకు ప్రాధాన్యం కారణంగా ఆఫర్లు, వేతనాలు ఆకర్షణీయంగా ఉంటాయని ప్లేస్మెంట్ వర్గాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

క్యాంపస్ డ్రైవ్ కే కంపెనీల మొగ్గు..... 

ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విధానంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా ముగియడంతోపాటు, ఫ్రెష్ టాలెంట్‌ను నియమించుకునే అవకాశం లభి స్తుంది. అందుకే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పేరుతో ముందుగానే నియామకాలు ఖరారు చేస్తున్నాయి. పీపీఓ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్ ప్లేస్ మెంట్స్ మరింత ఆశా జనకంగా ఉంటాయని చెప్పాచ్చు. క్యాంపస్ డ్రైవ్స్ అవకాశం లేని అభ్యర్థులు రిఫరల్ ఎంట్రీ, జాబ్ పోర్టల్స్, సంస్థలు నిర్వహించే సొంత నియామక ప్రక్రియల్లో నెగ్గేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి.
Previous Post Next Post