ఇకపై మీ జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్‌Google two step Verification: 

సోషల్‌ మీడియా, క్లౌడ్‌ స్టోరేజీ, వర్చువల్‌ వరల్డ్ మన జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఈ అకౌంట్లను రెగ్యులర్‌ టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఆయా అకౌంట్ల భద్రత ఎంతో ముఖ్యమైన వ్యవహరంగా మారింది. ఈ క్రమంలో తన యూజర్ల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

Two step verification 

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా మోసాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియా సైట్లు, బిజినెస్‌ మెయిల్స్‌లోకి దూరి వ్యక్తిగత సమాచారం లూటీ చేస్తున్నారు. దీంతో యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని గూగుల్‌ సంస్థ మరోసారి టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ (2ఎఫ్‌ఏ, టూ ఫ్యాక్టర్‌ అథెంటీకేషన్‌)ను అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే కేవలం పాస్‌వర్డ్‌ ఒక్కటి ఎంటర్‌ చేస్తే సరిపోదు. దాంతో పాటు మరో అథెంటీకేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది.

మొబైల్‌ ఉండాల్సిందే... 

టూ స్టెప్‌ వెరిఫికేషన్‌కి సంబంధించి యూజర్‌ సెట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ తర్వాత మొబైల్‌ ఫోన్‌ని రెండో ప్రామాణీకంగా గూగుల్‌ తీసుకుంటోంది. దీంతో ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌తో పాటు ఫోన్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయల్సి ఉంటుంది. కాబట్టి జీ మెయిల్‌ ఓపెన్‌ చేసేప్పుడు మీ ఫోన్‌ని పక్కనే ఉంచుకోవాలంటూ సూచన చేస్తోంది గూగుల్‌.

మొదలైన ప్రక్రియ... 

టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను జీ మెయిల్‌ వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీ మెయిల్‌ యూజర్లకు అలెర్ట్‌ మెసేజ్‌లు పంపిస్తోంది గూగుల్‌. తొలి దశలో  15 కోట్ల అకౌంట్లకు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను అమలు చేయనున్నారు. నవంబర్‌ 8 నుంచి ఎంపిక చేసిన యూజర్లను ఈ టూ స్టెప్‌ పరిధిలోకి తీసుకువస్తోంది గూగుల్‌. 


2022 చివరికి... 

గతంలో కూడా టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను అమలు చేయాలని గూగుల్‌ ప్రయత్నించినా యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. అయితే ఈసారి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో​ కేవలం పది శాతం యూజర్లకే దీన్ని పరిమితం చేసింది. 2022 చివరి నాటికి యూజర్లందరికి వర్తింప చేయాలనే వ్యూహంతో ఉంది. 

Post a Comment

Previous Post Next Post