జూలై ఒక‌టో తేదీ నుంచి పెద్ద మార్పులివే.. !



న్యూఢిల్లీ: జూలై ఒక‌టో తేదీ నుంచి ఇంటి లావాదేవీలు, బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు, ప‌న్ను చెల్లింపుల్లో ఐదు పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి.దేశంలోకెల్లా అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ (ఎస్బీఐ) త‌న ఖాతాదారుల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల (బీఎస్బీడీ)ల‌పై స‌ర్వీస్ చార్జీలు పెంచ‌బోతున్న‌ది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధ‌న కూడా మార‌నున్న‌ది. ఎల్పీజీ సిలిండ‌ర్ గ్యాస్ ధ‌ర‌తోపాటు ప‌న్ను విధానాల్లో మార్పు రానున్న‌ది. జూలై ఒక‌టో తేదీ నుంచి చోటు చేసుకోనున్న మార్పులేమిటో ఒక‌సారి చూద్దాం..
 

ఖాతాదారుల‌కు ఎస్బీఐ నూత‌న స‌ర్వీస్ చార్జీలు  -జూలై ఒకటి నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్!

జూలై ఒక‌టో తేదీ నుంచి ఎస్బీఐ త‌న ఖాతాదారుల‌కు అందించే సేవ‌ల‌పై చార్జీలు మార‌నున్నాయి. ఏటీఎం విత్ డ్రాయ‌ల్స్‌, చెక్ బుక్‌, మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ త‌దిత‌ర లావాదేవీల‌పై స‌ర్వీసు చార్జీలు వ‌ర్తింప చేయ‌నున్న‌ది.

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల (బీఎస్బీడీ) ఖాతాదారుల‌కు నాలుగు ఏటీఎం విత్ డ్రాయ‌ల్స్ వ‌ర‌కు ఉచితం. ఆ ప‌రిధి దాటితే చార్జీలు వ‌సూలు చేస్తుంది. జూలై ఒక‌టో తేదీ నుంచి ప్ర‌తి నెల‌లో తొలి ప‌ది చెక్‌ల విత్ డ్రాయ‌ల్స్ దాటితే చార్జీలు చెల్లించాల్సిందే. 

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది

జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్‌ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్‌టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు.
 

కెన‌రా బ్యాంక్ ఖాతాదారుల‌కు ముఖ్య సూచ‌న‌లు కెన‌రా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో జూలై ఒక‌టో తేదీ నుంచి సిండికేట్ బ్యాంక్ శాఖ‌ల ఐఎఫ్ఎస్సీ కోడ్‌లు మారిపోతాయి. సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు త‌మ శాఖ‌ల‌ను సంప్ర‌దించి నూత‌న కెన‌రా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు తెలుసుకోవాల‌ని కెన‌రా బ్యాంక్ సూచించింది.

ఐఎఫ్ఎస్సీ కోడ్‌ల‌తోనే నిఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్ ద్వారా న‌గ‌దు బ‌దిలీ జ‌రుగుతుంది. కెన‌రా బ్యాంక్ డాట్ కాం లేదా ఐఎఫ్ఎస్సీ డాట్ హెచ్టీఎంఎల్ లేదా కెన‌రా బ్యాంక్ వెబ్‌సైట్‌ను గానీ, ఏదేనీ కెన‌రా బ్యాంక్ శాఖ‌ను సంప్ర‌దించి న్యూ ఐఎఫ్ఎస్సీ యూఆర్ఎల్ తెలుసుకోవ‌చ్చు.సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్‌లు, ఐఎంసీఆర్ కోడ్ తెలుసుకోవాలి. అలాగే న్యూ చెక్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది.


ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు…


వాహ‌న‌దారులు ఇక లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. జూలై ఒక‌టో తేదీ నుంచి ఇంటి వ‌ద్దే ఆన్‌లైన్‌లో లెర్నింగ్‌ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి న్యూ సిస్ట‌మ్ అందుబాటులోకి వ‌స్తుంది. లెర్నింగ్ లైసెన్స్ జారీ ప్ర‌క్రియను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌. శాశ్వ‌త డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మాత్రం శిక్ష‌ణ పొందిన త‌ర్వాత జారీ చేస్తారు. ఈ మేర‌కు సెంట్ర‌ల్ మోటార్ వెహిక‌ల్స్ యాక్ట్ కూడా మార్చ‌నున్న‌ది.

ఇంకా వివాద్ సే విశ్వాస్ ప‌థ‌కం అమ‌లు, ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మార‌నున్నాయి.
Note:
If you have not yet filed Income Tax Return, then get this work done soon. Because according to the rules of Income Tax, in case of non-filing of return by June 30, you will have to pay double TDS from July 1. However, once again taxpayers have been given another opportunity to file ITR. The last date to file ITR has been extended to 30 September.








Previous Post Next Post