మెంతులు వల్ల కలిగే అత్యుత్తమ ఆరోగ్య ప్రయోజనాలు | మెంతుల నీరు ప్రయోజనాలు . మెంతులు.. రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఎన్నో రోగాలను ఇట్టే మాయం చేసే శక్తి మెంతులకు ఉంది. అందుకే మన పూర్వీకులు వంటలో మెంతులు ఎక్కువగా ఉపయోగించేవారు. మెంతులు వాడకం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెంతులు వల్ల కలిగే అత్యుత్తమ ఆరోగ్య ప్రయోజనాలు | మెంతుల నీరు ప్రయోజనాలు

 ఈ మధ్యకాలంలో చాలా మంది మెంతుల వాడకాన్ని తగ్గించేశారు. అయితే.. మళ్లీ మెంతులు వాడకం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. అంతేకాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చేమెంతుల్లో పీచు పదార్థాలు, ఇనుము,  విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం షుగర్ పేషెంట్స్ కి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మెంతులను నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. అంతేకాదు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. మెంతులు నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతోపాటు మలం విచ్చుకొని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.. రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకునే శక్తి మెంతులకు ఉంది.

అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. 1 టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.

ప్రతి రోజు రాత్రిపూట 2 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చర్మం ముడతలు, నలుపు వలయాలను అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.
మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా మెంతుల నీటిని తాగితే వ్యాధులు అదుపులో ఉంటాయి. అలానే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని కూడా నియంత్రిస్తాయి.

షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం వల్ల చాలా వరకూ డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది: గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది

మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది

మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలివే:
❂ జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది.
❂ మెంతులను నానబెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు.
❂ మెంతుల నీటిని తాగితే మలబద్ధకం, జీర్ణసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
❂ రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకునే శక్తి మెంతులకు ఉంది..  

కోలెన్ క్యాన్సర్ నివారిస్తుంది: మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది. దాంతో కోలెన్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

Previous Post Next Post