మినిమమ్ టైమ్ స్కేల్ తో డియస్ సి-2008 కు SGT లుగా నియామకం -2021 ఏపి టెట్ సిలబస్ విడుదల - రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

పాదయాత్రలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి... కోర్టు కేసులు పరిష్కరించి 2193 మంది డియస్ సి అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు.. మినిమమ్ టైమ్ స్కేల్ తో SGT లుగా నియామకం.. 2021 ఏపి టెట్ సిలబస్ విడుదల..

మినిమమ్ టైమ్ స్కేల్ తో డియస్ సి-2008 కు SGT లుగా నియామకం -2021 ఏపి టెట్ సిలబస్ విడుదల - రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్.. 2014 ఎన్నికల సందర్భంగా సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి డియస్ సి అభ్యర్ధులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, 2008 డియస్ సికి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించి 2193 మంది అభ్యర్ధులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

డియస్ సి-2008కి సంబంధించి పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల నియామకాలపై శుక్రవారం మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలోని ఆర్లాండ్ భవనం నందు మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక మైన పరిస్థితుల్లో మానవతా ధృక్పధంతో డియస్ సి-2008 కు సంబంధించి 2193 మంది అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేలుతో యఱిటి లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 2008-డియసిసికి సంబంధించి నియామకాల క్రైటీరియా నిబంధనల మార్పు వలన సుమారు 4 వేలకు పైచిలుకు అభ్యర్ధులు ఉద్యోగావకాశాలను కోల్పోవడం జరిగిందన్నారు. ఉద్యోగ అవకాశం కోల్పోయి కోర్టుల చుట్టూ ఈ అంశం నానుడికి గురి అయ్యిందన్నారు. 2014 ఎన్నికల హామీల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ 2008 డియస్ సి అభ్యర్థుల భవిత తేలుస్తామని చెప్పి రాజకీయం చేసి ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. ఇది ప్రచారానికి పరిమితమై నిరుద్యోగులను మోసగింపచేసారన్నారు. అయితే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చి సియం బాధ్యతలు చేపట్టి ఈ సుదీర్ఘ సమస్య పరిష్కారానికి సుముఖం చేసారన్నారు. ఆర్ధి కశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మినిమమ్ టైమ్ స్కేలులో యఱిటిలుగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశం కలిగిందని ఇందుకు సంబంధించిన దస్త్రం పై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుండి రాగానే సంతకం చేయనున్నారని అనంతరం జిఓను విడుదల చేయడం జరుగుతుందన్నారు. తదుపరి వీరికి ఆన్ లైన్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా వృత్తిపరమైన శిక్షణ అందించి నియామక ప్రక్రియను చేపడతామని ఆయన వెల్లడించారు. టెన్, ఇంటర్ పరీక్షల పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ పరీక్షల ప్రక్రియకు సుమారు 40 రోజులు సమయం అవసరం ఉంటుందన్నారు. దీంతో పాటు విద్యార్థులు నిట్, జెఇఇ, యం- సెట్ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సమయం అవసరం అవుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇప్పటిలో పరీక్షలు నిర్వహించే వీలులేదన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో తీసుకుని వాటి పై సంతృప్తి చెందిన పిదప తల్లిదండ్రులకు ఆందోళన లేకుండా పరీక్షలు నిర్వహిం చేందుకు షెడ్యూలును ప్రకటిస్తామని మంత్రి వివరించారు. 2018 డియస్ సి లో కూడా 6 వేల 361 పైచిలుకు అభ్యర్ధులను నియమించడం జరిగిందన్నారు. మరికొన్ని పోస్టులు పై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి మరో 486 పియుటి, స్కూల్ అసిస్టెంట్, తెలుగు పండిట్ లకు పోస్టులకు సంబంధించిన నియామకాలను జరపబోతున్నామన్నారు. మరో 374 లాంగ్వేజ్ పండిట్ పోస్టులపై రిట్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయని త్వరలో అడ్వకేట్ జనరల్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపి టెట్-2021 పరీక్షల సిలబస్ : ఏపిటెట్-2021 పరీక్షలకు సంబంధించిన సిలబసన్ను తయారు చేసి http://aptet.apcfss.in/లో పొందుపరిచినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమాచారం బ్రోచర్‌ను ఈసందర్భంగా ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్ జెడి యస్. రవీంధ్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post