కోవిడ్ మృతులకు రూ.4 లక్షల సాయం ఉత్తిదే.. వైరల్ అవుతున్న ఉపసంహరణ చేయక ముందు ఉత్తర్వులు
Present status:SC seeks Centre's reply on Rs 4 lakh ex-gratia to kin of Covid deceased. The Supreme Court Monday sought the Centre's reply on pleas seeking ex-gratia compensation of Rs 4 lakh to the families of those who have died of COVID-19
Senior advocate S B Upadhyay, appearing for petitioner Reepak Kansal who has also field a similar petition, said that large number of deaths are taking place due to COVID-19 and death certificates needs to be issued and after that they can claim compensation under section 12 (iii) of the Act.
The bench asked Upadhyay whether any payment had been made by any of the states.
Upadhyay replied that it has not been paid as the scheme for compensation ended last year and a similar scheme needs to be implemented, as a lot of families have suffered a loss due to the pandemic.
He said that was another letter issued on March 14, 2020, which said that to give benefit under NDMA Act, the disaster has to be a natural one and COVID has been notified as a disaster.
The bench said that the government has to come up with a scheme in this regard.
Kansal in his plea has said that states should be directed to fulfil their obligation to take care of victims of COVID-19 and also their family members.

కోవిడ్ మృతులకు రూ.4 లక్షల సాయం ఉత్తిదే -వైరల్ అవుతున్న ఉపసంహరణ చేయక ముందు ఉత్తర్వులు

కోవిడ్-19 బారినపడి మరణించి వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర విపత్తుల నివారణ నిధి (ఎసీఆర్ఎఫ్) నుంచి రూ.4 లక్షలు ఆర్ధిక సహాయంగా చెల్లించా లంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మళ్లీ అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ఉపసంహరించుకుంది. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహ మ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలు దీనిని విపత్తుగా ప్రకటించి బాధిత కుటుం బాలకు పరిహారంతోపాటు నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అప్పట్లోనే వెనక్కి తీసుకున్న ఈ ఉత్తర్వులు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆర్థిక సహాయం కోసం నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ కొంతమంది సామాజిక మాధ్య మాల్లో పంపుతున్నారు. అయితే, అసలు విషయం తెలియక చాలామంది నిజంగానే రూ.4 లక్షల పరిహారం లభిస్తుందని భావిం చారు. 

ఎన్టీఆర్ఎఫ్ కింద చేపట్టే సహాయక పనుల్లో 75 శాతం నిధులను కేంద్రం, 25 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కరోనా మృతుల సంఖ్య భారీగా ఉండటంతో పరిహారం చెల్లింపు సాధ్యం కాదన్న భావనతో కేంద్రం ఈ ఆదేశాలను ఉపసంహరించుకుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలన్న అంశంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది


 

Post a Comment

Previous Post Next Post