ఏపీ: త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. 20,501 జాబ్స్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. శాఖల వారీగా భర్తీకానున్న పోస్టులివే
Jobs in AP 2021: ఏపీ ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఉగాది రోజు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. 20,501 జాబ్స్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌


ప్రధానాంశాలు:
సచివాలయాల్లో 8,402 పోస్టులు
ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్- 6099
పోలీస్‌ జాబ్స్‌- 6000

జాబ్‌ నోటిఫికేషన్లు
1. సచివాలయాల్లో 8,402 పోస్టులు:
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే.. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

2. ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్- 6099
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్‌ (ఏహెచ్‌ఏ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

ఆర్బీకేల్లో కియోస్క్‌ ద్వారా పశు దాణా, మందులు కూడా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌ చేయించాలన్నారు. వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలని సీఎం జగన్‌ సూచించారు.
ఏహెచ్‌ఏ ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్:‌
ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్‌ (ఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అలాగే వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి 2021 జూన్‌ 1 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, కొత్తగా 21 ల్యాబ్‌ టెక్నీషియన్స్, 21 ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ వీటన్నింటికీ ఒకే కాల్‌ సెంటర్, ఒకే నంబర్‌ ఉండాలని పేర్కొన్నారు.
3. పోలీస్‌ జాబ్స్‌- 6000
ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున ఉద్యోగ క్యాలెండర్‌‌ విడుదలచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

APCPDCL లో 86 జేఎల్‌ఎం‌‌‌ జాబ్స్‌ భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్‌-2)
మొత్తం ఖాళీలు: 86
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Previous Post Next Post