మెడిసిన్, ఇంజినీరింగ్ అడ్మిషన్లో 15% సర్కారు బడుల్లో చదివిన వారికి మాత్రమే - ఒరిస్సా ప్రభుత్వ నిర్ణయం . సర్కారు బడుల్లో చదివిన వారికి మాత్రమే మెడిసిన్, ఇంజినీరింగ్ అడ్మిషన్లో 15 శాతం రిజర్వేషన్  అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం 

మెడిసిన్, ఇంజినీరింగ్ అడ్మిషన్లో 15% సర్కారు బడుల్లో చదివిన వారికి మాత్రమే - ఒరిస్సా ప్రభుత్వ నిర్ణయం

 అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
భువనేశ్వర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తీపి కబురు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సుల అడ్మిషన్లలో ప్రత్యేక రిజర్వేషన్ 15 శాతం కలించాలన్న ప్రభుత్వ తీర్మానం శాసన సభలో ఆమోదం పొందింది. ఈ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసనసభలో మంగళవారం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానం సభలో ఏకగ్రీవంగా ఆమోదం సాధించిందని బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే దేవీ ప్రసాద్ మిశ్రా తెలిపారు. ప్రభుత్వానికి కమిటీ నివేదిక
ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితి ఎటువంటి విపత్తుకు దారితీస్తుందోనన్న భయాందోళనను విద్యావేత్తలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించారు. ఈ తీర్మానంపై కార్యాచరణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎ.కె. మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రభుత్వానికి సోమవారం నివేదిక దాఖలు చేసింది. 

అధిక సీట్లు “ప్రైవేట్ విద్యార్థులవే"
ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 86 శాతం మంది. విద్యాభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో 23 శాతం, ఇంజినీరింగ్ కళాశాలల్లో 21 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నామమాత్రంగా 12 శాతం మంది పిల్లలు మాత్రమే విద్యాభ్యాసం చేస్తున్నారు. మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అత్యధికంగా 60 శాతం సీట్లు సాధిస్తున్నారు. ఈ విషయాన్ని జస్టిస్ డాక్టర్ ఎ.కె.మిశ్రా ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పేర్కొంది. ఇంజినీరింగ్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత శ్రేణి కోచింగ్ సెంటర్లలో చేరి ముందస్తు శిక్షణ పొందిన అభ్యర్థులు సీట్లు సాధిస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఎక్కువమం ది కోచింగ్ సెంటర్లలో చేరే అవకాశానికి దూరమయ్యారు. దీంతో ఉన్నత కోర్సుల్లో సీట్లు సాధించలేక పోతున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇంజినీరింగ్, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Previous Post Next Post