Army Recruitment Rally at Secunderabad 18th Jan - 28th Feb 2021 .2021 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు


 Army Recruitment Rally at Secunderabad 18th Jan - 28th Feb 2021

సికింద్రాబాద్ లో జనవరి 18 నుంచి రిక్రూట్ మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ నిర్వహించనుంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్ (ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్ మన్, అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 18 నుంచి ఫిబ్ర వరి 28 వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఓపెన్ కేటగిరీ స్పోర్ట్స్ మెన్ అభ్యర్థులు ట్రయల్ కోసం సికింద్రా బాద్ ఏవోసీ కేంద్రంలోని థాపర్ స్టేడియంలో జనవరి 15న ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలి... బాక్సింగ్, ఫుట్ బాల్, వాలీబాల్, బాక్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబ డ్డీలో జూనియర్/ సీనియర్ లెవల్ లో జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనకు సంబంధించిన సర్టిఫికె ట్లతో హాజరుకావాలి.
వయసు
సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టుకు 17 - 21 ఏళ్ల లోపు ఉండాలి. సోల్జర్ టెక్ (ఏఈ), సోల్డర్ క్లర్క్ | ఎ కేటీ అండ్ సోల్జర్ ట్రేడ్ మన్ పోస్టులకు 17 - 23 ఏళ్ల లోపు ఉండాలి.

అర్హత
సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టుకు 45 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్/ఎస్ఎస్సీ ఉత్తీర్ణత.
సోల్జర్ ట్రేడ్మన్ (పదో తరగతి అర్హత) పోస్టుకు 33 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత.
సోల్జర్ ట్రేడ్ మన్ (ఎనిమిదో తరగతి అర్హత) పోస్టుకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
సోల్జర్ టెక్ (ఏఈ) పోస్టుకు 50 శాతం మార్కు లతో సైన్స్ సబ్జెక్టులతో కూడిన 10+2 / ఇంటర్మీడి యట్(పీసీఎం 4 ఇంగ్లీష్) ఉత్తీర్ణత.
సోల్జర్ క్లర్క్/ఎస్ కేటీ పోస్టుకు 60 శాతం మార్కు లతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

ఎంపిక
డాక్యుమెంట్ల పరిశీలన, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
మెడికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన ప్రత సమాధానానికి 0.5 మార్కులు కోత విధిస్తారు.

పూర్తి వివరాలకు
చిరునామా: Headquarters AOC Centre, East Marredpally, Trimulgherry, Secunderabad (TS) 500015. ఈమెయిల్: airavat0804@nic.in వెబ్ సైట్: www.joinindianarmy.nic.in


Previous Post Next Post