Daily Current Affairs#9 AP India Current Affairs TOP Bits for Competitive Exams Edition#9
Today's Current Affairs#9 Key Points



Today's Current Affairs#9 Key Points

ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌక ఎక్కడ సేవలందిస్తోంది?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో భారీ పేలుడు
ఎప్పుడు : జనవరి 18
ఎక్కడ : ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌
ఎందుకు : ప్రమాదవశాత్తూ...

ఎయిర్‌ ఇండియా చీఫ్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : సీనియర్‌ బ్యూరోక్రాట్‌ విక్రమ్‌ దేవ్‌ దత్‌
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సీనియర్‌ స్థాయి బ్యూరోక్రాటిక్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా..

ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌ పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థ?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారు..
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌’’ నివేదిక
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా..
ఎందుకు : కరోనా సంక్షోభం కారణంగా...

ఇండియా ఓపెన్‌ పురుషుల టైటిల్‌ సొంతం చేసుకున్న ద్వయం?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్ గెలుచుకున్న జోడీ?
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం(భారత్)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–16, 26–24తో మొహమ్మద్‌ ఎహ్‌సాన్‌–హెంద్రా సెతియవాన్‌ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచినందున..

SISFS: స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకానికి ఎంపికైన సంస్థ?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ పథకానికి ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : టి హబ్‌
ఎందుకు : స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు..

విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలు?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలిగా రికార్డు
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : 19 ఏళ్ల బెల్జియన్‌–బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌
ఎక్కడ : కోర్ట్‌రై, బెల్జియం
ఎందుకు : మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి..

రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : వేములదీవి ప్రాంతం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
ఎందుకు : పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని..

పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత ఏ జిల్లాలో అమలులోకి తెచ్చారు?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత అమలులోకి తెచ్చారు?
ఎప్పుడు : నవంబర్‌ 19, 2021
ఎవరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఎక్కడ : విజయనగరం జిల్లా
ఎందుకు : నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షరవెలుగులు నింపేందుకు..

టోఫీ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా చేపడుతున్న చర్యల్లో భాగంగా..


ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన శాస్త్రవేత్త?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : తివనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.సోమనాథ్‌
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.శివన్‌ పదవీకాలం 2022, జనవరి 14న ముగియనుండటంతో..

యూరోపియన్‌ పార్లమెంట్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్‌ పార్లమెంట్‌(ఈపీ) అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : డేవిడ్‌ మరియా సస్సోలీ(65)
ఎక్కడ : ఏవియానో, ఇటలీ
ఎందుకు : రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో..

ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌
ఎక్కడ : బీజింగ్, చైనా
ఎందుకు : ప్రస్తుతం ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే పాండ్యన్‌ పదవీ కాలం ముగియడంతో..

జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : జైలు శిక్ష విధింపబడిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : మయన్మార్‌ పదవీచ్యుత నేత అంగ్‌సాన్‌ సూకీ(76)
ఎక్కడ : మయన్మార్‌
ఎందుకు : చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్‌ ఆంక్షలను ధిక్కరించినందున..

దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి?
క్విక్‌ రివ్యూ :ఏమిటి : 2021 ఏడాదిలో అత్యుత్తమ డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ నిలిచారు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ది బెటర్‌ ఇండియా సంస్థ
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : కోవిడ్‌ క్లిష్ట సమయంలోనూ పజలకు విశేష సేవలు అందించినందున..

Oil and Natural Gas Corporation: ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : అల్కా మిట్టల్‌
ఎందుకు : ఓఎన్‌జీసీ తాత్కాలిక హెడ్‌ సుభాష్‌ కుమార్‌ 2021, డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..

బ్లడ్‌ శాండర్స్‌: ద గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌ పుస్తక రచయిత ఎవరు?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : బ్లడ్‌ శాండర్స్‌: ద గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌ పుస్తక రచయిత ఎవరు?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ప్రముఖ పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి
ఎందుకు : ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పరిరక్షణ నిమిత్తం సూచనలు చేసేందుకు...

మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీని ఎవరు స్థాపించారు?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీకి లైసెన్స్‌ పునరుద్ధరణ
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి కల్పించేందుకు..

భద్రతా వైఫల్యంపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కేబినెట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్‌ కుమార్‌ సక్సేనా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు..

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితి?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితి పెంపు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎందుకు : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..

రాష్ట్రంలోని స్కూల్‌కు జనరల్‌ రావత్‌ పేరు పెట్టారు?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఒక సైనిక్‌ స్కూల్‌కు దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును పెట్టాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : మెయిన్‌పురి జిల్లా, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : హెలికాప్టర్‌ ప్రమాదంలో తమళనాడులోని నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా..

మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్‌ కంపెనీ?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మినీ రత్న హోదా పొందిన ఇంజనీరింగ్‌ కంపెనీ?
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : రైల్వే శాఖ పరిధిలోని ‘‘బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో’’ సంస్థ
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
ఎందుకు : 2020–21లో బ్రెయిత్‌వైట్‌ అండ్‌ కో సంస్థ రూ.609 కోట్ల ఆదాయంపై రూ.25 కోట్ల లాభాన్ని నమోదు చేసినందున..

ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఏ టెలికం కంపెనీలో ప్రభుత్వానికి వాటా లభించనుంది?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : వొడాఫోన్‌ ఐడియా సంస్థ
ఎందుకు : రుణ భారంతో సతమతమవుతున్నందున..
Previous Post Next Post