Chittoor Anganwadi Recruitment 2021 - ICDS Chittoor Anganwadi 484 Posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడీ ఉద్యోగాల నియమకాలు-2021 - ప్రకటన
నోటిఫికేషన్ నెంబర్:4/ఏ3/2021 తేదీ:24 .08.2021 జిల్లాలోని 20 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన 2021 

Chittoor Anganwadi Recruitment 2021 - ICDS Chittoor Anganwadi 484 Posts

Chittoor Anganwadi Recruitment APPLICATIN: దరఖాస్తు:
1. అంగన్వాడీల నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫోర్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో లేదా https://chittoor.ap.gov.in/ నుండి పొంది, తిరిగి సంబందిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

Chittoor Anganwadi Recruitment 2021 Eigibility: అర్హతలు

2. అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.

3. అభ్యర్థులు వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండవలెను.

4. 01.07.2021 నాటికీ దరఖాస్తుచేయు అభ్యర్థుల వయస్సు 21 సం.లు. నుండి 35 సం.లు లోపల వారు అయి యుండవలెను. 

 5. అంగన్వాడీ సహాయకురాలు ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తకు దరఖాస్తు చేసుకోవాలంటే జి.ఓ.ఎం.ఎస్. నెం.102, తేది: 28.03.2011 మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారము గరిష్ట వయసు 45 సం.లు. 

 6. యస్.సి. మరియు యస్.టి. ప్రాంతములలో గల యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.

7. అంగన్వాడి కార్య కర్త/అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ కొరకు యస్.సి. మరియు యస్.టి. హాబిటేషన్స్ నందు యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు మాత్రమే అర్హులు.

గౌరవ వేతనం
8. అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును. ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.11500/నెలకు,మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/- నెలకు మరియు అంగన్వా డీ హెల్పెర్ గౌరవ వేతనం : రూ.7000/- నెలకు జి.ఓ. ఏం.ఎస్.నెం.13 WCD&SC (PROGS) తేది: 26.06.2019 ప్రకారం చెల్లించబడును.

జతపరచవలసినవి
9. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం (యస్.సి/యస్.టి/బి.సి. అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలయును.

10. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి./స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్రుటిని సమయములో సిడిపిఓ ఎటువంటి అవకతవకలుకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.

11. కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ఏదేని గెజిటెడ్ అధికారి చే ధృవీకరణ చేసినవి జతపరచవలయును. 12. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటో ను ముందు భాగములో అతికించి, ఫోటో ఏదేని గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయవలయును.

13. దరఖాస్తులను స్వయముగా సమర్పించవచ్చు మరియు తపాలా ద్వారా కూడా సమర్పించవచ్చు.

14. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము మరియు మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

రిజర్వేషన్:
1. ఎ.పి.రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ యొక్క నియమం 22 ప్రకారం రిజర్వేషన్ల నియమం అనుసరించబడుతుంది.
2. EWS: ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ జి.ఓ. ఎం.ఎస్. నం.66, GA (Ser.D) Dt.14.7.2021 మరియు జి.ఓ. ఎం.ఎస్. నం. 73 GA (Ser.D) తేదీ: 04-08-2021 అనుసరించబడుతుంది.
3. BC-E కింది కి చెందిన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక గౌరవ న్యాయస్థానముల తుది తీర్పునకు మరియు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండును. నియామక పద్ధతి ప్రభుత్వం జి.ఓ. నం. 18 మహిళలు, పిల్లలు (ప్రోగ్) వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ తేదీ: 15.05.2015 ప్రకారం, అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్ల నియామకాల కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీని అన్ని సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) ప్రాజెల పునర్నియమించింది మరియు అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్ల ఎంపిక కోసం క్రింద వివరించిన విధంగా పారామీటర్లు/ప్రమాణాలు సవరించడం జరిగింది.

పునర్నియమించిన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ

1) జిల్లా కలెక్టర్/చైర్ పర్సన్ జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ - చైర్ పర్సన్
2) సంబంధిత రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ - సభ్యులు
3) జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్/అదనపు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ - సభ్యులు
4) సి.డి.పి.ఓ. సంబంధిత - సభ్యులు
5) 5.పథక సంచాలకులు , జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ- సభ్యులు- కన్వీనర్

పారామీటర్లు/ప్రమాణాలు:


Download Notification and APPLICATION Form
Previous Post Next Post