*✨ నూతన విద్యా విదానం*
★ విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

★ నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని, రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
★ నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని.. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు.

★ ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని,

నూతన విద్యా విధానంవల్ల జరిగే మేలును వారికి వివరించాలన్నారు.
★ మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు, వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

*ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..*
★ స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు.

★ ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదు.

★ ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మనం మార్పులు చేస్తున్నాం.

★ రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం.

★ పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు.

★ వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది.

★ మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి.

★ ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం.
★నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు.
★ ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు.
★ పౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరం
★ ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరం.
★ 8 సంవత్సరాలలోపు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుంది.
★ ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి.
★ ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి.
★ 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్‌ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు.
★ అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్‌ రూంలు పెట్టడం సరికాదు .
★ ఎన్‌ఈపీ(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌) ప్రకారం.. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యం.
★ ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి.
★ మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్న పనులు. తలదించుకుని చేస్తున్న పనులు కావు.
★ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులుకు మంచి జరుగుతుందని చెప్పండి
★ పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి.
★ నూతన విద్యావిధానంలో ఒక స్కూల్‌ మూతపడ్డం లేదు
★ ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదు.
★ అంతిమంగా అదే సందేశం పోవాలి
★ ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం
★ పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం

★ పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నా
★ ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దుతున్నాం. 
★ ప్రస్తుతం విద్యావ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నాం, గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం, సానుకూల దృక్పథంతో పనిచేయండి.
★ నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి.
★ ఎవరైనా సందేహాలు వ్యక్తంచేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి
★ ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యావిధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
★ భాగ స్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి.
★ వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణప్రణాళిక తయారుచేయాలి.
★ రెండేళ్లలో ఈకార్యక్రమాలన్నీ పూర్తికావాలి

*అంగన్వాడీల్లో నాడు–నేడు*

►అంగన్వాడీలు కూడా నాడు–నేడులో భాగం. దీనికి కూడా ఒక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించండి.
►2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్‌ పూర్తి కావాలి.
►వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం.
►ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి
►సాచ్యురేషన్‌ పద్ధతిలో అంగన్వాడీలు
►55 వేల అంగన్వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు.
►పౌండేషన్‌ స్కూల్‌ కాన్సెఫ్ట్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది
►అందరూ ఇదే ఫాలో అవ్వాలి
►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్‌జీటీ టీచర్‌ డీల్‌ చేయలేడు
►ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ అవసరం
►ఆట స్థలంలేని స్కూళ్లకు నాడు– నేడు కింద భూమిని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం.

►వచ్చే ఏడాది ప్రస్తుతం విద్యాకానుకలో ఇస్తున్న దానికంటే అదనంగా స్పోర్ట్స్‌ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. దీనికోసం ప్రణాళిక వేసుకోవాలి.
►అలాగే పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలు బలోపేతం చేసుకోవాలన్న సీఎం.
►పాఠశాల లైబ్రరీల్లో మంచి ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలన్న సీఎం.

*జులై 1 నుంచి రెండో విడత నాడు– నేడు ప్రారంభం*

►స్కూళ్లలో నాడు – నేడుపై తెలంగాణ అధికారులు సంప్రదించారన్న విద్యాశాఖ అధికారులు.


►తెలుగువారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలన్న సీఎం.


►విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని చూపించిన అధికారుల

*ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.*
Previous Post Next Post