GGH కు కృష్ణపట్నం ఆయుర్వేద కరోనా మందు - అధికారుల సమక్షంలో అందించాలని నిర్ణయం

  • జీజీహెచ్ కు కృష్ణపట్నం మందు
  • కరోనా రోగులపై అధికారుల సమక్షంలో అందించాలని నిర్ణయం
  • మెరుగైన ఫలితాలొస్తే.. ఆ దిశగా ప్రభుత్వానికి నివేదిక
  • అనుమతులొస్తే .. కృష్ణపట్నం మందుకు పచ్చజెండా
  • కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం పరుగో పరుగు ..పంపిణీ లేదంటూ పోలీసుల సూచన ... అనుమతి రాగానే రావాలంటూ ఆదేశం

గోపాలపురం సెంటర్ వద్ద బందోబస్తులో ఉన్న కృష్ణపట్నం పోర్టు పోలీసులు

 GGH కు కృష్ణపట్నం ఆయుర్వేద కరోనా మందు - అధికారుల సమక్షంలో అందించాలని నిర్ణయం

కృష్ణపట్నం గ్రామంలో కరోనా వైరస్ నిర్మూలనకు నాటు వైద్యుడు ఆనందయ్య ఇచ్చినటువంటి ఆయుర్వేద మందు కొసం వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం గ్రామానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణపట్నం గ్రామానికి పరుగో పరుగు అంటూ కరోనా బాధితులకుటుంబాలు పెద్ద ఎత్తున మందు కోసం రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఈ కరోనా ఆయు ర్వే దం మందులు పంపిణీ నిలిపివేయడంతో విషయం తె లియక దూరప్రాంత ప్రజలు గ్రామానికి చేరుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారు లు గోపాలపురం సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పా టు చేశారు. కరోనా ఆయుర్వేదం మందు కోసం వచ్చేటువంటి వారిని పోలీస్ శాఖ అధికారులు నిలుపుదల చేసి మందు పంపిణీ లేదంటూ తెలియపరిచి వెళ్లిపొ మ్మని చెప్పడం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు జిల్లానలు మూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఉదయం ఐదు గంటలకే కృష్ణపట్నం గ్రామానికి కరోనా మందు కోసం ప్రజలు రావడం జరిగింది. మందు పంపిణీ లేదని స్థానికులతో పాటు పోలీసు శాఖ అధికారులు చెప్పడంతో నిరాశ నిస్పృహలతో వెళ్లిపోయారు. ఈ మందు పంపిణీపై కొంతమంది లోకాయుక్త లో కేసు వేశారని వార్త తెలుసుకుని అసహనం వ్యక్తం చేస్తూ ప్రాణాలు కాపాడే వారిపట్ల ఇలాంటి కేసులు ఏమిటని శాపనార్థాలు పెడుతూ తిడుతూ వెళ్లారు. పోలీస్ శాఖ అధికారులు ఇతర ప్రాంతం వారిని ఎవరిని కూడా కృష్ణపట్నం గ్రామం లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కరోనా ఆయుర్వేదం మందు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేశాక గ్రామానికి రావాలని పోలీస్ శాఖ అధికారులు సూచించారు. కృష్ణపట్నం గ్రామంలో పోలీసు బృందం బందోబస్తు నిర్వహించింది. నాటు వైద్యుడు ఆనందయ్య వైద్యం కావాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేదం మందు పంపిణీ జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

కృష్ణపట్నం నుంచి ఆయుర్వేద మందు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ... 

జిల్లా ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్లు గంగాధర్, మాధవరావులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణప ట్నం గ్రామానికి విచ్చేసి ఈ ఆయుర్వేద మందులు కరొనా రోగులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయుర్వేదం వైద్యుడు ఆనందయ్య సమక్షంలో కరోనా పాజిటివ్ రోగులకు ఆయుర్వేదం మందులు తయారు చేయించి తీసుకెళ్లడం జరిగింది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఈ ఆయుర్వేద మందు తీసుకువెళ్లి అక్కడ ఉన్న కొంత మంది కరోనా రోగులకు ట్రయల్స్ కిందవేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సుమారు పదిమంది కరోనా రోగులకు ఈ ఆయుర్వేద మందులు వేసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి రికార్డ్ చేయాలని కలెక్టర్ తెలియపరిచారు. ఈ మందును వేయకముందు కరోనా రోగుల ఆ రోగ్య పరిస్థితి గురించి రికార్డ్ చేయాలని ఆయుష్ శాఖ అధికారులకు సూచించారు. ఈ మందు వల్ల కరోనా రోగులకు నయం అవుతుందని ఆయుష్ శాఖ అధికారులు నివేదిక ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాగానే కృష్ణ పట్నం గ్రామం లోనే నాటు వైద్యుల సమక్షంలో ఆయు ర్వేద మందు తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసివచ్చింది. ఏది ఏమైనా ఆయుర్వేదమ దుసక్సెస్ అవుతుందని ప్రజలు అంటున్నారు. ఈ నేప థ్యంలో ఆయుష్ శాఖ అధికారులు కూడా ఈ మందుప ఖసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. కరోనా పాజిటివ్ రోగుల కుటుంబాల పాలిట దైవంలా నిలిచిన ఆనందయ్యకు ప్రజలు అండగా నిలబడుతున్నారు.

Previous Post Next Post