పాఠశాలల టాయిలెట్స్ నిర్వహణపై వర్క్ షాప్  School Toilets Maintenance Workshop

పాఠశాలల టాయిలెట్స్ నిర్వహణపై వర్క్ షాప్  School Toilets Maintenance Workshop

  • పాఠశాలల టాయిలెట్స్ నిర్వహణపై వర్క్ షాప్
  • నేటి నుంచి 3 రోజులపాటు ఒక్కో జిల్లాలో 11 మందికి శిక్షణ
  • రాష్ట్ర విద్యాశాఖ, ఐఏఈఎస్పీహెచ్ ఆధ్వర్యంలో నిర్వహణ

రాష్ట్రంలోని అన్ని పాఠశాల ల్లో టాయిలెట్స్ నిర్వహణపై కల్పించి నైపుణ్యాన్ని పెంపొం దించేందుకు విద్యాశాఖ ఒక కార్యశాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల రూపు రేఖలు మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణపై 13 జిల్లాల నుంచి వచ్చే అధికారులకు, రిసోర్స్ పర్సన్లకు మార్చి 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజులుపాటు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్లో సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు వివిధ అంశాలపై అవ గాహన కల్పించనున్నారు. ఇంటర్నేషనల్ అకాడమి ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ (ఐఏఈ ఎస్పీహెచ్) సౌజన్యంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలిపింది. 13 జిల్లాలకు చెందిన ప్రతినిధులుగా ఇద్దరు మండల విద్యా అధికారులు, ఇద్దరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు కమ్యూనిటీ రిసోర్స పర్సన్స్, ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు ఆయాలతో పాటు మిడ్ డేమీల్స్ సహాయ సంచాలకులు ఈ కార్యశాలకు హాజరవుతారని విద్యాశాఖ స్పష్టం చేసింది. మార్చి 23న పారిశుధ్యం- పరిశుభ్రత ప్రాథమికాంశాలుగా పాఠశాలలు తీసుకోవాల్సిన చర్యలపై, అందుబాటులో ఉన్న శానిటేషన్ పరికరాల వినియోగంపై శిక్షణ అందిస్తారు 4వ తేదీన వ్యర్థాలు వాటిని సాంకేతికపరంగా విని యోగించుకునే వ్యవస్థలపై జరుగుతుంది, తదుపరి పాఠ శాలల్లోని టాయిలెట్స్ నిర్వహణపైన కూడా శిక్షణ అందిస్తారు. 

25వ తేదీన క్షేత్రస్థాయిలోని మోడల్ స్కూల్ను సందర్శించనున్నారు. అందులో భాగంగా గుంటుపల్లి ఏపీ ( టైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూలు, జడ్పీ హైస్కూ ళ్లలో బృందాలు పర్యటిస్తాయి. మొత్తం 3 రోజులు పాటు జరి గే ఈ కార్యక్రమాన్ని రెండు బృందాలుగా విభజించి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. విజయవాడ సమీపంలోని బెరం పార్క్ ప్రాంగణంలో జరిగే కార్యశాలలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ కార్యదర్శి బి. రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడు, రాష్ట్రస్థాయి అధికారులతో పాటు రిసోర్స్ పర్సన్స్ జి. ఉదయ్ కుమార్, ఎం.సంగీత, కె. అరుణ, డా.ఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొంటారు.

Previous Post Next Post