Increasing of Gas Cylinder Rates once Again. మరోసారి సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ - భారీగా పెరిగిన గాస్ ధర . మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. మరోసారి పెరిగిన గ్యాస్ ధర.. ఎంత పెరిగిందంటే..?


మరోసారి సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ - భారీగా పెరిగిన గాస్ ధర 

Gas cylinder price Increased: నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో సాధారణ ప్రజలు నానా తంటలు పడుతుంటే.. ఇప్పుడు గ్యాస్ బండ ధర కూడా గుదిబండగా..

Gas cylinder price Increased: నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో సాధారణ ప్రజలు నానా తంటలు పడుతుంటే.. ఇప్పుడు గ్యాస్ బండ ధర కూడా గుదిబండగా మారింది. మరోసారి వంట గ్యాస్ రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 1న గ్యాస్ ధరలు పెంచకపోవడంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ప్రభుత్వం ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు నేటినుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ధరల పెంపు తరువాత ఎల్పీజీ సిలిండర్ ధర (14.2 కిలోలు) దేశ రాజధాని ఢిల్లీలో రూ. 719కి చేరగా.. కోల్‌కతాలో రూ.745.50, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. తాజాగా పెరిగిన ధర తరువాతం హైదరాబాద్‌లో సిలిండర్ ధర.. రూ.746.50 నుంచి రూ.771.50 కి చేరింది.

Previous Post Next Post