ప్రజలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి మొత్తం చెల్లించాల్సిందే..

ప్రజలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి మొత్తం చెల్లించాల్సిందే..

Subsidy on Kerosine Cancel??
కిరోసిన్‌పై సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్‌పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వార పంపిణీ చేసే కిరోసిన్‌కు కూడా లబ్ధిదారులు మార్కెట్ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
.వాస్తవానికి ఇది అధికారిక ప్రకటన కాకపోయినా.. తాజాగా బడ్జెట్ కేటాయింపులను బట్టి ఇదే విషయాన్ని కేంద్రం నిర్ధారించింది. పేదలకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్‌కు సబ్సిడీ కోసం ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపేవారు. అయితే ఈ ఏడాది ఆ కేటాయింపులు పూర్తిగా నిలిపివేశారు. దాంతో కిరోసిన్‌పై ఇప్పటి వరకు ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసినట్లయింది. కాగా, గత ఏడాది బడ్జెట్‌లో కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 2,677 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. అయితే తాజా బడ్జెట్‌లో కేటాయింపులేవి లేకపోవండంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిరోసిన్‌ను మార్కెట్‌ రేటుకే అమ్మకాలు చేపడతారు.

Previous Post Next Post