Kurnool Medical Department Recruitment - Medical Staff in Kurnool District 2020WD&CW Dept-DISHA OSC,Kurnool -Calling of applications fro appointment of vacant post from 05.12.2020 to 19.12.2020

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము (మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ, కర్నూలు జిల్లా)  మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా పరిధిలోని దిశ వన్ స్టాప్ సెంటర్ (సఖి) నందు దిగువ తెలుపబడిన పోస్టులు క్రింది విధముగా మంజూరు చేయబడినవి. ఈ పోస్టుల నియామకమునకై అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరబడుచున్నవి.

Kurnool Medical Department Recruitment - Medical Staff in Kurnool District 2020


విద్యార్హతలు:
1. పారా లీగల్ : లా డిగ్రీ కలిగి, మరియు మహిళల పట్ల జరుగుచున్న హింస పై కౌన్సిలింగు చేయుటలో మహిళా అభ్యర్థిని లా డిగ్రీ ప్రభుత్వం లేదా నాన్-గవర్నమెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం 3 సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి.

2. కేస్ వర్కర్ :- లా డిగ్రీ / మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్/ M.A సోషియాలజీ /సైకాలజీ కలిగి, మరియు మహిళల పట్ల జరుగుచున్న హింస పై కౌన్సిలింగు చేయుటలో మహిళా అభ్యర్థిని లా డిగ్రీ/సోషల్ వర్కులో మాస్టర్ డిగ్రీ కలిగి, ప్రభుత్వం లేదా నాన్-గవర్నమెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం 3 సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి.

3. పారా మెడికల్ పర్సనల్ :- పారా మెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్ గా /బి.యస్సీ.నర్సింగ్ /జి.యన్ .యం. కలిగి ఉండవలెను. మరియు ఆరోగ్యం నేపథ్యంలో పారామెడి/ వృత్తిపరమైన డిగ్రీని కలిగి మరియు జిల్లాలో మహిళలపై హింసాపట్ల పై ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్ట్ / కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో పనిచేసిన మహిళ ఉండవలెను.

4. సెక్యురిటీ గార్డు /నైట్ గార్డు:-స్త్రీ జిల్లాలో ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలో భద్రతా సిబ్బందిగా కనీసం 2 సంవత్సరాల అనుభవాన్ని కలిగిన వుండాలి. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.

అభ్యర్థులు అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ, రెండవ అంతస్తు, వెలుగు ఆఫీస్ ఎదురుగా వున్నా ఐ.సి.పి.ఎస్ కార్యాలయము, కర్నూలు (కలెక్టరేట్) వారి కార్యాలయములో ధరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను.

అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతపరచవలెను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మాట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను.

జతపరచవలసిన ధ్రువపత్రములు:
1.విద్యార్హత
2. కులము
3. పుట్టిన తేది
4. నివాస ధ్రువపత్రము
5.పాస్ పోర్టు ఫోటోలు.

ధరఖాస్తు వెంట ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరిచి, కార్యాలయపు పనిదినములలో అదనపు పథక సంచాలకులు,

జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కర్నూలు తేది: 05.12..2020 నుండి 19.12.2020 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

Details https://kurnool.ap.gov.in/

Previous Post Next Post