UCIL 244 Trade Apprentice Recruitment Notification 2020 Uranium Corporation of India Limited. Uranium Corporation of India Limited [UCIL], Jaduguda invites applications from Ex-ITI
[NCVT] candidates for trade apprenticeship training under Apprentices Act- 1961 read in
conjunction with Apprenticeship Rules 1992..

UCIL 244 Trade Apprentice Recruitment Notification 2020 Uranium Corporation of India Limited

యురేనియం కార్పొరేషన్‌లో 244 అప్రెంటిస్  జాబ్స్‌.. రాత పరీక్ష లేదు..!

Uranium Corporation of India Limited: యూసీఐఎల్ ‌244 ట‌్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది.

యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌)లో ఖాళీగా ఉన్న‌ 244 ట‌్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు డిసెంబర్‌10 చివరితేది. ఎలాంటి రాత ప‌రీక్ష లేదు. అంటే అభ్య‌ర్థులను ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక‌ చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://uraniumcorp.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 244
ఫిట్ట‌ర్ - 80
ఎల‌క్ట్రిష‌న్ - 80
వెల్డ‌ర్ - 40
ట‌ర్న‌ర్ లేదా మెషినిస్ట్ - 15
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 10
ఎంవీ మెకానిక్ - 10
కార్పెంట‌ర్ - 5
ప్లంబ‌ర్ - 4

ముఖ్య సమాచారం:
అర్హ‌త‌లు: ప‌దో త‌ర‌గ‌తి లేదా మెట్రిక్యులేష‌న్‌లో 50 శాతం మార్కుల‌తో పాస‌వ్వాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కుల‌తో ఐటీఐ ఉత్తీర్ణుల‌వ్వాలి.
 

వయసు: 2020, న‌వంబ‌ర్ 20 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: ‌ప‌దో త‌ర‌గ‌తి లేదా మెట్రిక్యులేష‌న్‌, ఐటీఐలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 10, 2020

వెబ్‌సైట్‌: http://uraniumcorp.in/

Post a Comment

Previous Post Next Post