SSC CHSL - Clerks Data Entry Operators Recruitment 2020  Staff Seletion Commission  Clerks Data Entry Operators Central Govt Job with Intermediate - SSC CHSL - Clerks Data Entry Operators.Staff Selection Commission (SSC) has announced a notification to conduct Combined Higher Secondary Level (10+2) Exam 2020 for the recruitment of Lower Divisional Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA), Postal Assistant/ Sorting Assistant, Data Entry Operator (DEO) vacancies. Those Candidates who are Interested to the following vacancy and completed all Eligibility Criteria can read the Notification & Apply Online.. Staff Selection Commission Clerical Jobs 2020. Central Govt Job with Intermediate 2020 - Salary up to Rs 92300 -SSC CHSL - Clerks Data Entry Operators. 2020 Notice of Examination for Combined Higher Secondary (10+2) Level Examination,2020 Website of the Commission: https://ssc.nic.in). 

 SSC CHSL - Clerks Data Entry Operators Recruitment 2020 Staff Seletion Commission Clerks Data Entry Operators

ఇంటర్‌తో ‘సెంట్రల్‌’ జాబ్స్‌.. ఎస్‌ఎస్‌సీ - సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఎగ్జామ్‌. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ పోస్టులను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)తరవాత స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) రెగ్యులర్‌గా భర్తీ చేస్తుంటాయి. ఇప్పుడే అదే కోవలో కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ(10+2) (సీహెచ్‌ఎస్‌ఎల్‌)ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. దీని ద్వారా లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ), పోస్టల్‌ అసిస్టెంట్‌(పీఏ)/ సార్టింగ్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు


అర్హత: ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈఓ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత. కాగ్‌ ఆఫీస్‌లో డీఈఓ(గ్రేడ్‌ -1) పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మేథ్స్‌తో కూడిన సైన్స్‌ స్ర్టీమ్‌ ఇంటర్మీడియట్‌ పాస్‌ కావాలి.

మొత్తం ఖాళీలు : (అంచనా)  4726

Lower Divisional Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA)1538
Postal Assistant/ Sorting Assistant 3181
Data Entry Operator (DEO) 07

వయసు: 2021 జనవరి 1 నాటికి 18 - 27 ఏళ్ల మధ్య ఉండాలి. 1994 జనవరి 2 - 2003 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలవారికి ప్రభుత్వ నిబంధన మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌ సర్వీస్‌మన్‌/మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఆన్‌లైన్‌ రూపంలో డిసెంబరు 17లోపు, చలానా రూపంలో డిసెంబరు 21లోపు ఫీజు చెల్లించాలి. చలానా రూపంలో చెల్లించే అభ్యర్థులు డిసెంబరు 19 లోపు రశీదును జనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వేతనం:

  • డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ): రూ.19,900 - 63,200(పే లెవల్‌ - 2)
  • పోస్టల్‌ అసిస్టెంట్‌(పీఏ)/సార్టింగ్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ): రూ.25,500 - 81,100(పే లెవల్‌ - 4)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ): రూ.25,500 - 81,100 (పే లెవల్‌ - 4) & రూ.29,200 - 92,300(పే లెవల్‌ - 5)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌ - ఎ): రూ.25,500 - 81,100 (పే లెవల్‌ - 4)

పరీక్ష విధానం

మూడు దశల్లో పరీక్ష విధానం ఉంటుంది. అవి వరుసగా టైర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), టైర్‌-2(రాత పరీక్ష), టైర్‌-3(స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌).

టైర్‌-1: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు, ఒక్కోటి రెండు మార్కులకు అంటే 50 మార్కులకు ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 100 కాగా మార్కులు 200. ఇంగీష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు ఇంగ్లీష్‌ మరియు హిందీ భాషల్లో ఇస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.5 మార్కులు కట్‌ చేస్తారు.

టైర్‌-2: డిస్ర్కిప్టివ్‌ తరహాలో ఉంటుంది. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో జరుగుతుంది. కాలవ్యవధి 60 నిమిషాలు(గంట). ఎస్సే/లెటర్‌/అప్లికేషన్‌/ప్రిసెస్‌ రైటింగ్‌ తదితరాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జవాబులను ఇంగ్లీష్‌, ఇంగ్లీష్‌ భాషల్లో రాసుకోవచ్చు.

టైర్‌-3: ఇది స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌కు సంబంధించింది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు దీన్ని నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
స్కిల్‌ టెస్ట్‌లో గంటకు ఎనిమిది వేల కీ డిప్రెషన్స్‌ను డేటా ఎంట్రీ స్పీడ్‌గా నిర్ణయించారు. 15 నిమిషాల వ్యవధిగల ఈ పరీక్షలో 2000 - 2200 వరకు కీ డిప్రెషన్స్‌ ఉంటాయి.
‘కాగ్‌’కు కీ డిప్రెషన్స్‌ 15000 వరకు నిర్ణయించారు.
మిగిలిన పోస్టులకు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇంగ్లీ్‌షలో అయితే నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. హిందీ ఎంపిక చేసుకుంటే 35 పదాల వేగం ఉండాలి. టెస్ట్‌ 10 నిమిషాలకు ఉంటుంది.

ఎంపిక
టైర్‌-1లో సాధించిన మెరిట్‌ ఆధారంగా టైర్‌-2 పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. సాధారణీకరించిన స్కోర్స్‌ ఆధారంగా మెరిట్‌ నిర్ణయిస్తారు.
పోస్టులను బట్టి ప్రతి కేటగిరీ కోసం కటా్‌ఫను నిర్ణయిస్తారు. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలలో చూపిన ప్రతిభ ఆధారంగా టైర్‌-3కి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అయితే టైర్‌-2 ఎగ్జామ్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు.
డీఈఓ పోస్టుకు స్కిల్‌ టెస్ట్‌ తప్పనిసరి.
డీఈఓయేతర పోస్టులకు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివరి తేదీ: డిసెంబరు 15

  • Last Date to Apply Online: 26-12-2020 23:30 Hrs
  • ( Extended from 15-12-2020 to 19-12-2020, Again Extended to 26-12-2020 23:30 Hrs)
  • Last date for Payment of Fee through Online: 17-12-2020 Extended to 21-12-2020 Again Extended to 28-12-2020 by 23:30 Hrs
  • Last date for generation of offline Challan: 19-12-2020 Extended to 23-12-2020 Again Extended to 30-12-2020 by 23:30
  • Last date for Payment of Fee through Challan: 21-12-2020 Extended to 24-12-2020 Again Extended to 01-01-2021

తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు:
ఏపీ: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణ:హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌
పరీక్ష తేదీలు: టైర్‌-1 2021 ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు, టైర్‌-2 తేదీని తరువాత ప్రకటిస్తారు

Notification: Download
వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Registration Link : https://ssc.nic.in/Registration/Home
Previous Post Next Post